IND vs BAN: 13 మ్యాచ్‌లు.. 11 ఓటములు.. 2 డ్రాలు.. తొలి విజయం కోసం ఎదురుచూస్తోన్న బంగ్లా పులులు

|

Sep 17, 2024 | 3:48 PM

India vs Bangladesh Test: సెప్టెంబర్ 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో 2 టెస్టు మ్యాచ్‌లు జరుగుతుండగా, ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు మ్యాచ్ చెన్నైలో జరగనుండగా, రెండో టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానుంది.

IND vs BAN: 13 మ్యాచ్‌లు.. 11 ఓటములు.. 2 డ్రాలు.. తొలి విజయం కోసం ఎదురుచూస్తోన్న బంగ్లా పులులు
Ind Vs Ban Test Series Stats
Follow us on

India vs Bangladesh Test Series Stats: భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. గురువారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఎందుకంటే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బంగ్లాదేశ్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాలి. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్ల నుంచి తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.

రెండు జట్ల మధ్య మ్యాచ్‌ల గణాంకాలు..

గణాంకాల ప్రకారం ఇక్కడ భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో టీమిండియా మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ క్రమంలో భారత జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పటి వరకు భారత్‌పై ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా గెలవలేదు. అయితే 2 మ్యాచ్‌ల్లో డ్రా చేసుకోగలిగింది. తద్వారా భారత్‌తో సిరీస్‌ను డ్రా చేసుకోగలిగితే బంగ్లాదేశ్ జట్టుకు అది గొప్ప విజయం అవుతుంది.

ఇవి కూడా చదవండి

చివరి సిరీస్ ఫలితం..

భారత్, బంగ్లాదేశ్‌లు చివరిసారిగా 2022లో టెస్టు సిరీస్ ఆడాయి. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

అయితే, ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే.. చివరి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. అంటే బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 227 పరుగులు చేయగా, భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 231 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. దీంతో 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కాబట్టి, ఈ సిరీస్‌లోనూ బంగ్లాదేశ్ జట్టు నుంచి ఉత్కంఠభరిత పోరును ఆశించవచ్చు.

బంగ్లాదేశ్ టెస్టు జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మద్ హసన్ జాయ్, జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రాణా, హసన్ , తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ , కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, యష్ దయాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..