IND vs PAK: ఆసియాకప్ విజేత భారత్‌కు అందిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

U19 Asia Cup 2026 Award Winners: 338 పరుగుల ఛేజింగ్, చివరి బంతికి విక్టరీ.. పాకిస్థాన్‌ను మట్టికరిపించి భారత్ 9వ సారి అండర్-19 ఆసియా కప్ గెలిచింది. టోర్నీ ఆసాంతం చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ఫైనల్ హీరో మోహిత్ ఉల్వాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కాయి. విన్నర్లకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందంటే?

IND vs PAK: ఆసియాకప్ విజేత భారత్‌కు అందిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
U19 Asia Cup 2026 Award Winners

Updated on: Nov 15, 2026 | 11:57 AM

U19 Asia Cup 2026 Award Winners: ఫైనల్ అంటే ఇలా ఉండాలి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, 338 పరుగుల భారీ లక్ష్యం, 86 పరుగులు 52 బంతుల్లో కావాల్సిన దశ నుంచి అద్భుత పునరాగమనం, 50వ ఓవర్ చివరి బంతికి 339/9తో ఒక్క వికెట్ తేడాతో గెలుపు.. శనివారం రాత్రి భారత కుర్రాళ్లు ఆసియా కప్‌ను ఎత్తుకోవడం వెనుక రెండు పేర్లు మార్మోగాయి. ఒకరు ఫైనల్ హీరో మోహిత్ ఉల్వా, మరొకరు టోర్నమెంట్ హీరో ఆర్యవీర్ సెహ్వాగ్.

భారత్‌కు ఇది ఏకంగా 9వ అండర్-19 ఆసియా కప్ టైటిల్. గెలుపు ఓటముల కథను చివరి బంతి దాకా తీసుకెళ్లిన ఈ ఫైనల్ తర్వాత నిర్వాహకులు అవార్డుల జాబితా ప్రకటించారు. అందులో ఎవరేం గెల్చుకున్నారో చూద్దాం.

టోర్నీ రారాజు.. ఆర్యవీర్ సెహ్వాగ్..!

ఈ టోర్నీ మొత్తానికి బ్యాట్‌తో రాజ్యమేలింది వీరేంద్ర సెహ్వాగ్ వారసుడు ఆర్యవీర్ సెహ్వాగ్. 5 మ్యాచ్‌ల్లో 361 పరుగులు, సగటు 90.25. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. మామూలు మ్యాచ్‌ల్లో కాదు.. పెద్ద మ్యాచ్‌ల్లో, ఒత్తిడి ఉన్న వేళల్లో పరుగులు బాదడం అతని ప్రత్యేకత. భారత్ టైటిల్ వేటలో అతడు వెన్నెముకగా నిలిచాడు. అందుకే నిర్వాహకులు ఏమాత్రం తడబాటు లేకుండా అతనికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కట్టబెట్టారు.

బౌలింగ్‌లో నూర్ అలీ నియాజీ, రిజ్వానుల్లా చెరో 14 వికెట్లతో సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్లుగా నిలిచినా.. కీలక సమయాల్లో నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొని సెహ్వాగ్ చేసిన పరుగుల విలువే ఎక్కువని అందరూ అంగీకరించారు.

ఫైనల్ మ్యాన్.. మోహిత్ ఉల్వా..!

80 పరుగులకు పైగా కావాల్సిన దశలో.. 10వ నంబర్‌లో వచ్చి 26 బంతుల్లో 49 నాటౌట్ (5 ఫోర్లు, 3 సిక్సర్లు, స్ట్రైక్ రేట్ 188.46) బాదిన మోహిత్ ఉల్వాది మరో సంచలనం. మనల్ చౌహాన్‌తో కలిసి కౌంటర్ అటాక్ చేసి మ్యాచ్‌ను లాగేశాడు. చివరి బంతికి 3 పరుగులు కావాల్సిన చోట బౌండరీ బాది ఫినిష్ చేశాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (ఫైనల్) అతనికే దక్కింది.

ప్రైజ్ మనీ ఎంతంటే?

విన్నర్ – ఇండియా: 15,000 డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.14 లక్షల 13 వేలు.
రన్నరప్ – పాకిస్థాన్: 7,500 డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.7 లక్షలకు పైగా, పాక్ కరెన్సీలో సుమారు 20 లక్షలు.

గెలిచిన నోట్ల కంటే గెలిచిన పేరు పెద్దది. పాక్ చేతిలో నుంచి మ్యాచ్ లాక్కొని కప్ ఎత్తిన ఈ తరం కుర్రాళ్లు.. రేపటి టీమిండియా స్టార్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

U19 ఆసియా కప్ 2026 అవార్డుల ఫుల్ లిస్ట్:

ఛాంపియన్: ఇండియా (339/9 – 1 వికెట్ తేడాతో గెలుపు)

రన్నరప్: పాకిస్థాన్

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (ఫైనల్): మోహిత్ ఉల్వా – 49* (26 బంతుల్లో)

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్: ఆర్యవీర్ సెహ్వాగ్ – 361 రన్స్ (5 మ్యాచ్‌ల్లో, యావరేజ్ 90.25)

లీడింగ్ వికెట్ టేకర్లు: నూర్ అలీ నియాజీ (14), రిజ్వానుల్లా (14).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us