ICC New Rules: ఐసీసీ కీలక నిర్ణయం.. మహిళల క్రికెట్‌లో బ్యాటింగ్‌లో పవర్‌ప్లేను తొలగింపు..

|

Apr 02, 2021 | 4:50 PM

కరోనా వ్యాప్తితో ప్రపంచం మొత్తం దిగ్బంధంలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అవసరాలకు అనుగుణంగా..

ICC New Rules: ఐసీసీ కీలక నిర్ణయం.. మహిళల క్రికెట్‌లో బ్యాటింగ్‌లో పవర్‌ప్లేను తొలగింపు..
Umpire's Call
Follow us on

కరోనా వ్యాప్తితో ప్రపంచం మొత్తం దిగ్బంధంలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది.  అవసరాలకు అనుగుణంగా టోర్నమెంట్లకు జట్టుతో పాటు సహాయక సిబ్బందికి అనుమతించింది. ఇందులో అదనంగా ఏడుగురు  సీనియర్  ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి అనుమతించింది.  ఐసీసీ బోర్డు వరుస వర్చువల్ సమావేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో  టీమిండియా జూన్‌లో 30 మంది సభ్యులతో కలిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెల్లనుంది. వీటితో ఐసీసీ మరికొన్ని  నిర్ణయాలు తీసుకుంది. మహిళల క్రికెట్‌కు సంబంధించి, వన్డే క్రికెట్‌లో ఆట నిబంధనలలో రెండు మార్పులు చేసింది ఐసిసి.

దిగ్బంధం తప్పనిసరి కావడంతో జట్లు బయో సేఫ్ బబుల్‌లోనే ఉండనున్నాయి.  టోర్నమెంట్లలో ఏడుగురు సీనియర్  ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందిని చేర్చడానికి ఐసీసీ అనుమతి ఇచ్చింది. భారతదేశంలో జరగనున్న టి 20 ప్రపంచ కప్‌కు సంబంధించిన పన్ను విధానం, వీసా హామీ వచ్చే నెలలోగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు ఐసిసి తెలిపింది.

కరోనా కారణంగా అండర్ 19 ప్రపంచ కప్ వాయిదా..

ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌లో జరగనున్న తొలి మహిళా అండర్ 19 ప్రపంచ కప్‌ను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. “కరోనా మహమ్మారి అనేక దేశాలలో అధికంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నందున చాలా జట్లు ప్రాక్టీస్ చేయలేక పోయాయి. దీంతో ప్రపంచ కప్ కోసం సిద్ధం కాలేదు. ఇటువంటి పరిస్థితిలో మొదటి మహిళా అండర్ -19 ప్రపంచ కప్ జనవరి 2023 లో నిర్వహించనున్నారు. మహిళల ప్రపంచ కప్ 2022 గ్లోబల్ క్వాలిఫైయర్స్ ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనుంది.

డిఆర్ఎస్ విషయంలో..

ఇదిలావుంటే.. డిఆర్ఎస్ విషయంలో అంపైర్స్ కాల్ నిబంధన తొలగించే ప్రసక్తే లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి కమిటీ అధ్యక్షుడు అనిల్ కుంబ్లే వెల్లడించాడు. అయితే మైదానంలో ఫీల్డ్ అంపైర్‌కు ఉండే విలువను కాపాడేందుకు అంపైర్స్ కాల్ చాలా అవసరమని, అందుకే దానిని తొలగించే అవకాశమే లేదని చెప్పారు. అయితే డీఆర్‌ఎస్ విషయంలో మూడు మార్పులను మాత్రం చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!

గుర్తుందా.. వినబడుతోందా.. ఆ శబ్ధం.. ధోని సిక్సర్.. విశ్వవిజేతగా టీమిండియా.. ఆ అద్భుతానికి సరిగ్గా పదేళ్లు..