AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20I Records: టీ20 హిస్టరీలోనే తోపు బౌలర్లు.. అన్ని ఓవర్లు మెయిడీన్లే.. దడ పుట్టించిన ముగ్గురు..

t20I Cricket Records: టీ20 క్రికెట్‌లో 4 మెయిడెన్ ఓవర్లు బౌలింగ్ చేయడం అంటే అసాధ్యమనే చెప్పాలి. కానీ, కొంతమంది బౌలర్లు ఈ రికార్డ్‌ను అవలీలగా పూర్తి చేసి సత్తా చాటారు. అలాంటి తోపు బౌలర్లు నలుగురు ఉన్నారు. ఈ లిస్ట్‌ను ఓసారి చూద్దాం..

T20I Records: టీ20 హిస్టరీలోనే తోపు బౌలర్లు.. అన్ని ఓవర్లు మెయిడీన్లే.. దడ పుట్టించిన ముగ్గురు..
T20i Records
Venkata Chari
|

Updated on: Aug 29, 2025 | 10:36 AM

Share

Cricket Records: క్రికెట్‌లో ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు. ఏ రికార్డ్ ఎప్పుడు బద్దలవుతుందో, ఎప్పుడు నమోదవుతుందో చెప్పడం కష్టమే. ఇక టీ20 క్రికెట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టీ20 క్రికెట్‌లో 4 మెయిడెన్ ఓవర్లు బౌలింగ్ చేయడం గురించి ఏ బౌలర్ కూడా ఆలోచించడం కష్టం. చాలా మంది దీనిని ఒక జోక్‌గా భావిస్తారు. కానీ ఈ 20-20 ఓవర్ ఫార్మాట్‌లో, ఈ అసాధ్యమైన రికార్డు కూడా నమోదైంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తమ కోటాలో 4 ఓవర్లను మెయిడెన్‌గా బౌలింగ్ చేసిన ముగ్గురు బౌలర్లు ప్రపంచంలో ఉన్నారు. ఇలాంటి ముగ్గురు బౌలర్లను ఓసారి చూద్దాం..

1. సాద్ బిన్ జాఫర్ (కెనడా): 2021 నవంబర్ 14న పనామాతో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ అమెరికాస్ రీజియన్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కెనడా ఎడమచేతి వాటం స్పిన్నర్ సాద్ బిన్ జాఫర్ తన 4 ఓవర్ల కోటాలోని 4 మెయిడెన్ ఓవర్లను బౌలింగ్ చేశాడు. సాద్ బిన్ జాఫర్ పనామాతో జరిగిన మ్యాచ్‌లో 4 మెయిడెన్ ఓవర్లు వేసి 4 ఓవర్లలో ఒక్క పరుగులే ఇవ్వకుండానే 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా జట్టు 20 ఓవర్లలో 1 వికెట్‌కు 245 పరుగులు చేసి పనామా ముందు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి ప్రతిస్పందనగా, పనామా జట్టు 17.2 ఓవర్లలో 37 పరుగులకే కుప్పకూలింది. కెనడా 208 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

2. లాకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్): 2024 జూన్ 17న పాపువా న్యూ గినియాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ తన 4 ఓవర్ల కోటాలోని 4 మెయిడెన్ ఓవర్లను బౌలింగ్ చేశాడు. లాకీ ఫెర్గూసన్ పాపువా న్యూ గినియాపై 4 మెయిడెన్ ఓవర్లు వేసి 4 ఓవర్లలో ఒక్క పరుగులే ఇవ్వకుండా 3 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో, పాపువా న్యూ గినియా జట్టు 19.4 ఓవర్లలో 78 పరుగులకు ఆలౌట్ అయింది. దీనికి ప్రతిస్పందనగా, న్యూజిలాండ్ జట్టు కేవలం 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో 46 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

3. ఆయుష్ శుక్లా (హాంకాంగ్): 2024 ఆగస్టు 31న మంగోలియాతో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫయర్-ఏ మ్యాచ్‌లో హాంకాంగ్ మీడియం పేసర్ ఆయుష్ శుక్లా తన 4 ఓవర్ల కోటాలోని 4 మెయిడిన్ ఓవర్లను బౌలింగ్ చేశాడు. ఆయుష్ శుక్లా మంగోలియాపై 4 మెయిడిన్ ఓవర్లు వేసి 4 ఓవర్లలో ఒక్క పరుగులే ఇవ్వకుండానే 1 వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో, మంగోలియా జట్టు 14.2 ఓవర్లలో 17 పరుగులకు ఆలౌట్ అయింది. దీనికి ప్రతిస్పందనగా, హాంకాంగ్ జట్టు కేవలం 1.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో హాంకాంగ్ 110 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్