Team India: చెత్త ఫాంతో చిరాకు తెప్పిస్తోన్న టీమిండియా సీనియర్.. నేటి మ్యాచ్‌ నుంచి ఔట్.. ఎవరొచ్చారంటే?

|

Jun 12, 2024 | 6:59 AM

Ravindra Jadeja Replacement: టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత జట్టు ప్రదర్శన ఇప్పటివరకు చాలా బాగుంది. భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్ ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్థాన్‌లను ఓడించి సూపర్-8లోకి ప్రవేశించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్‌గా టీమిండియా ఆటతీరు బాగానే ఉంది. కానీ, కొంత మంది ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. భారత దిగ్గజ ఆల్ రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రదర్శన చాలా పేలవంగా తయారై, జట్టును ఇబ్బంది పెడుతోంది.

Team India: చెత్త ఫాంతో చిరాకు తెప్పిస్తోన్న టీమిండియా సీనియర్.. నేటి మ్యాచ్‌ నుంచి ఔట్.. ఎవరొచ్చారంటే?
Team India
Follow us on

Ravindra Jadeja Replacement: టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత జట్టు ప్రదర్శన ఇప్పటివరకు చాలా బాగుంది. భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్ ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్థాన్‌లను ఓడించి సూపర్-8లోకి ప్రవేశించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్‌గా టీమిండియా ఆటతీరు బాగానే ఉంది. కానీ, కొంత మంది ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. భారత దిగ్గజ ఆల్ రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రదర్శన చాలా పేలవంగా తయారై, జట్టును ఇబ్బంది పెడుతోంది.

ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రవీంద్ర జడేజా ప్రత్యేకంగా రాణించలేకపోయాడు. ఓవరాల్‌గా రెండు మ్యాచ్ ల్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. వచ్చిన వెంటనే తొలి బంతికే జడేజా ఔటయ్యాడు.

భారత ప్లేయింగ్ XIలో రవీంద్ర జడేజా స్థానంలో వచ్చేందుకు ముగ్గురు ఆటగాళ్లు పోటీ.. వారెవరో ఇప్పుడు చూద్దాం..

1. యుజ్వేంద్ర చాహల్..

టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. IPL 2024లో బాగానే ఆకట్టుకున్నాడు. ఈ కారణంగా అతను 2024 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో యుజ్వేంద్ర చాహల్‌కు ఆడే అవకాశం రాలేదు. ఇటువంటి పరిస్థితిలో, రవీంద్ర జడేజా ఫ్లాప్ ప్రదర్శన తర్వాత, చాహల్ ఆడవచ్చు. అతను వికెట్ టేకింగ్ బౌలర్, మ్యాచ్‌ను తనంతట తానుగా మార్చగలడు.

2. కుల్దీప్ యాదవ్..

రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ కూడా గొప్ప ఎంపిక. భారత జట్టు మొదటి రెండు మ్యాచ్‌లలో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్‌లను రంగంలోకి దించింది. అయితే జడేజా ఫ్లాప్ అయినందున, ఒక స్పిన్ ఆల్ రౌండర్‌ను కుల్దీప్ యాదవ్‌కు తగ్గించవచ్చు. వికెట్లు తీయడంలో కుల్దీప్ యాదవ్‌కు పేరుంది. ప్రస్తుతం అతను ఫామ్‌లో ఉన్నాడు. అందుకే జడేజా స్థానంలోకి అతను సరైన ఎంపిక కావచ్చు.

3. సంజు శాంసన్..

ఒకవేళ టీమ్ ఇండియా అదనపు బ్యాట్స్‌మెన్‌ను ఆడాలనుకుంటే, రవీంద్ర జడేజా స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వవచ్చు. శాంసన్ ఇటీవల IPL 2024లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సంజూ శాంసన్‌ ఫామ్‌ని చూస్తే అతడికి అవకాశం ఇవ్వడం కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్‌లపై టెక్నికల్‌గా చాలా మంచి బ్యాట్స్‌మెన్‌ అవసరం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..