AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Riyan Parag : సంగీత ప్రపంచంలో విషాదం.. సింగర్ మృతికి కన్నీళ్లు పెట్టుకున్న రియాన్ పరాగ్

భారత క్రికెట్ జట్టు, రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీనికి కారణం అస్సాం ప్రఖ్యాత గాయకుడు జుబిన్ గార్గ్ మరణం. 52 ఏళ్ల జుబిన్ గార్గ్ సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేసే సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ వార్త అస్సాం మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

Riyan Parag : సంగీత ప్రపంచంలో విషాదం.. సింగర్ మృతికి  కన్నీళ్లు పెట్టుకున్న రియాన్ పరాగ్
Riyan Parag
Rakesh
|

Updated on: Sep 21, 2025 | 1:48 PM

Share

Riyan Parag : భారత క్రికెట్ జట్టు, రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీనికి కారణం అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మరణం. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన జుబిన్ గార్గ్ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త అస్సాంతో పాటు దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అస్సాం ప్రముఖ గాయకుడు, సంగీత విప్లవకారుడుగా పేరు గాంచిన జుబిన్ గార్గ్ మరణం యావత్ దేశాన్ని శోకంలో ముంచింది. సింగపూర్‌లో స్క్యూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన జుబిన్ గార్గ్ మారుమూల ప్రాంతమైన అస్సాం సంస్కృతి, సంగీతాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన మరణంపై భారత క్రికెటర్ రియాన్ పరాగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జుబిన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో లైవ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు.

రియాన్ పరాగ్, జుబిన్ గార్గ్‌ను దాబంగ్ మామ అని ఆప్యాయంగా పిలిచేవారు. జుబిన్ మృతిపై రియాన్ మాట్లాడుతూ.. జుబిన్ మామ మరణం నా జీవితంలో ఒక పెద్ద లోటు. ఆయన సంగీతంతో అస్సాం సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన కేవలం పాటలు పాడటమే కాదు, ప్రతి పాటతో ప్రజల ఆలోచనలను మార్చారు. ఆయన పోయిన తర్వాత వచ్చిన ఈ ఖాళీని ఎవరూ భర్తీ చేయలేరు అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

జుబిన్ గార్గ్ అస్సాం సంగీత ప్రపంచానికి ఒక కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. “సంగీతానికి భాష, ప్రాంతం అంటూ హద్దులు ఉండవు అని జుబిన్ మామ నిరూపించారు. ఆయన పాటలు అస్సాం సంస్కృతిని ప్రపంచమంతటా వ్యాప్తి చేశాయి” అని రియాన్ పరాగ్ కొనియాడారు.

జుబిన్ గార్గ్ సింగపూర్‌లో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ స్క్యూబా డైవింగ్ చేస్తుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. బాలీవుడ్‌లో ఆయనకు యా అలీ అనే సినిమా పాటతో పెద్ద పేరు వచ్చింది. ఆయన మరణం పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు