AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 ఓవర్లలో సెంచరీ.. 14 సిక్సర్లు, 29 ఫోర్లతో 256 పరుగులు.. దిమాక్ కరాబ్ చేసే ఇన్నింగ్స్ భయ్యా..

Sir Don Bradman Birthday: డాన్ బ్రాడ్‌మాన్ ఆస్ట్రేలియాలోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో కూడా దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. అతను తన కెరీర్‌లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను కేవలం 3 ఓవర్లలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి, చరిత్ర సృష్టించాడు.

3 ఓవర్లలో సెంచరీ.. 14 సిక్సర్లు, 29 ఫోర్లతో 256 పరుగులు.. దిమాక్ కరాబ్ చేసే ఇన్నింగ్స్ భయ్యా..
Don Bradman Birthday
Venkata Chari
|

Updated on: Aug 27, 2025 | 10:46 AM

Share

Sir Don Bradman Birthday: క్రికెట్‌లో బౌలర్ల పాలిట అత్యంత డేంజరస్ బ్యాటర్‌ను ఎప్పుడైనా చేశారా.. సఅలు ఎలా ఉంటాడో తెలుసా, బరిలోకి దిగితే బంతితోపాటు బౌలర్ పరిస్థితి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిందే. అలాంటి ఓ దిగ్గజ ప్లేయర్ ఆస్ట్రేలియన్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మాన్ ఇన్నింగ్స్‌ గురించి తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఓ ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌మాన్ కేవలం 3 ఓవర్లలోనే తన సెంచరీని పూర్తి చేశాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఆ తర్వాత, బ్రాడ్‌మాన్ బ్యాట్ మరింత పవర్‌తో తిరిగొచ్చింది. కేవలం 3 ఓవర్లలో సెంచరీ చేసిన బ్రాడ్‌మాన్ మొత్తం మ్యాచ్‌లో 256 పరుగులు చేశాడు. ఇప్పుడు మనం అకస్మాత్తుగా సర్ డాన్ బ్రాడ్‌మాన్, అతని ఇన్నింగ్స్ గురించి ఎందుకు ప్రస్తావించామని ప్రశ్న కలగవచ్చు. అందుకు ఓ కారణం ఉంది. ఆగస్టు 27 1908లో జన్మించిన బ్రాడ్‌మాన్ పుట్టినరోజు 117వ వార్షికోత్సవం.

14 సిక్సర్లు, 29 ఫోర్లు.. 256 పరుగులతో బ్రాడ్‌మాన్ బీభత్సం..

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సర్ డాన్ బ్రాడ్‌మాన్ తన సెంచరీని ఎప్పుడు, ఏ జట్టుపై 3 ఓవర్లలో పూర్తి చేశాడు? కాబట్టి, బ్రాడ్‌మాన్ బ్యాట్ నుంచి ఆ తుఫాన్ 1931 సంవత్సరంలో కనిపించింది. అంటే టీ20 క్రికెట్ జాడ లేనప్పుడు. అంటే, క్రికెట్‌లో ఆ సమయంలో ఒక ఓవర్ 8 బంతులు ఉండేవి. అప్పుడు బ్రాడ్‌మాన్ ప్రపంచానికి తుఫాన్ బ్యాటింగ్‌ను పరిచయం చేశాడు.

బ్లాక్‌హీత్ XI వర్సెస్ లిత్‌గో XI మధ్య జరిగిన మ్యాచ్‌లో, బ్రాడ్‌మాన్ బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఓడించాడు. ఆ మ్యాచ్‌లో అతను బ్లాక్‌హీత్ జట్టులో ఒకడిగా బరిలోకి దిగాడు. మొదట బ్యాటింగ్ చేసిన బ్లాక్ హీత్ జట్టు 357 పరుగులు చేసింది. ఇందులో 256 పరుగులు బ్రాడ్‌మాన్ ఒక్కడే చేయడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌మాన్ 14 సిక్సర్లు, 29 ఫోర్లు బాదాడు. అనంతరం లిత్‌గో XI 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 228 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను 129 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

3 ఓవర్లలో సెంచరీ ఎలా సాధించాడంటే..

బ్రాడ్‌మాన్ కేవలం 22 బంతుల్లోనే అంటే 3 ఓవర్లలోపే తన సెంచరీని పూర్తి చేశాడు. మొదటి ఓవర్‌లో 33 పరుగులు, రెండవ ఓవర్‌లో 40 పరుగులు, మూడవ ఓవర్‌లో 27 పరుగులు చేయడం ద్వారా అతను ఈ ఘనతను సాధించాడు. బ్రాడ్‌మాన్ మొదటి ఓవర్‌లో ఒకసారి 2 పరుగులు, ఒక సింగిల్ తీసుకున్నాడు. అంతేకాకుండా 3 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత, అతను రెండవ ఓవర్‌లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టాడు. మూడవ ఓవర్‌లో, అతను 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టడంతో పాటు ఒక సింగిల్ తీసుకున్నాడు.

1వ ఓవర్: (బౌలర్-విల్ బ్లాక్) 6, 6, 4, 2, 4, 4, 6, 1: మొత్తం 33 పరుగులు

2వ ఓవర్: (బౌలర్- హారీ బేకర్) 6, 4, 4, 6, 6, 4, 6, 4: మొత్తం 40 పరుగులు

3వ ఓవర్: (బౌలర్-విల్ బ్లాక్) 6, 6, 1, 4, 4, 6: మొత్తం 27 పరుగులు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్