Ashes Series: 15 ఏళ్ల ఇంగ్లండ్ కల నెరవేరేనా.. ఆసీస్‌తో యాషెస్ పోరుకు రంగం సిద్ధం.. షెడ్యూల్ ఇదే..

|

Oct 16, 2024 | 1:28 PM

Ashes 2025-26, AUS v ENG Test Series: ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్లు టెస్ట్ సిరీస్‌లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న యాషెస్ సిరీస్‌ను దక్కించుకుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది.

Ashes Series: 15 ఏళ్ల ఇంగ్లండ్ కల నెరవేరేనా.. ఆసీస్‌తో యాషెస్ పోరుకు రంగం సిద్ధం.. షెడ్యూల్ ఇదే..
Ashes 2025 26, Aus V Eng Test Series
Follow us on

Ashes 2025-26, AUS v ENG Test Series: టెస్టు క్రికెట్‌లో ప్రతిష్టాత్మక పోరుగా పేరుగాంచిన యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 21, 2025 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈసారి కూడా మొత్తం 5 మ్యాచ్‌లు జరుగుతుండగా, ఈ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. 1882లో ప్రారంభమైన ఈ టెస్టు పోరులో ఇప్పటి వరకు 73 సిరీస్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 34 సార్లు గెలుపొందగా, ఇంగ్లండ్ జట్టు 32 సార్లు సిరీస్‌ను కైవసం చేసుకుంది. విశేషమేమిటంటే.. ఈ 73 సిరీస్‌లలో ఇరు జట్లు సమంగా నిలవగా, సిరీస్ 7 సార్లు మాత్రమే డ్రాగా ముగిసింది. అంటే, యాషెస్ సిరీస్‌లో ఫలితం రావడం ఖాయం.

ఈసారి యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. 2023లో ఇంగ్లండ్‌లో జరిగిన సిరీస్‌ను ఆస్ట్రేలియా డ్రా చేసుకుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా యాషెస్ సిరీస్ జరుగుతుండటంతో బేస్ బాల్ జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి.

కానీ, కంగారూ కంట్రీలో ఇంగ్లండ్ యాషెస్ గెలిచి 15 ఏళ్లు పూర్తయ్యాయి. చివరిసారిగా 2010-11లో ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్‌ ఒక్కసారి కూడా సిరీస్‌ గెలవలేకపోయింది.

ఆస్ట్రేలియా జట్టు కథ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇంగ్లండ్‌లో ఆసీస్ యాషెస్ సిరీస్ గెలిచి సరిగ్గా 24 ఏళ్లు. అంటే 2001లో చివరిసారిగా ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 74వ యాషెస్ సిరీస్‌కు సన్నాహాలు ప్రారంభించగా, అందులో మొదటి భాగంగా షెడ్యూల్‌ను ప్రకటించారు.

యాషెస్ సిరీస్ షెడ్యూల్ 2025-26..

మ్యాచ్ తేదీ వేదిక
1వ టెస్ట్ నవంబర్ 21 నుంచి 25 వరకు ఆప్టస్ స్టేడియం, పెర్త్
2వ టెస్ట్ డిసెంబర్ 4 నుంచి 8 వరకు గబ్బా, బ్రిస్బేన్
3వ టెస్ట్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు అడిలైడ్ ఓవల్, అడిలైడ్
4వ టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు MCA, మెల్బోర్న్
5వ టెస్టు జనవరి 4 నుంచి 8 (2026) సిడ్నీ క్రికెట్ స్టేడియం, సిడ్నీ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..