క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్.. ఇన్‌స్టాలో ఆకృతి అగర్వాల్ సంచలన పోస్ట్..!
Akriti Agarwal Announces Split From Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీంతో కొన్నాళ్లుగా వినిపిస్తున్న రూమర్స్ నిజమేనని రుజువైంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.

Akriti Agarwal Announces Split From Prithvi Shaw: భారత జట్టుకు దూరమైన యువ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇదే ఏడాది మార్చి నెలలో ఆకృతి అగర్వాల్ (Aakriti Agarwal) తో ఆయన నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. స్వల్ప వ్యవధిలోనే వీరి బంధం ముగింపు దశకు చేరింది. భవిష్యత్ లక్ష్యాలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది. తమ మార్గాలు వేరని గ్రహించామని, అందుకే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నామని తెలియజేస్తూ ఆమె రాసిన ఇన్ స్టా పోస్ట్ క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ఈ మొత్తం వ్యవహారంపై ఆకృతి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను అభిమానులతో పంచుకుంది. ఎంతో బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు ఆమె పేర్కొంది. ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కలిసి ప్రయాణం చేయలేమని అర్థం చేసుకున్నట్లు రాసుకొచ్చింది. తమ బాధ్యతలు, ఇప్పటి సంక్లిష్ట పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాతే ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించింది.
View this post on Instagram
ఇలాంటి సున్నితమైన సమయంలో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని ఆమె ప్రజలను కోరింది. తమ బంధం ముగియడానికి గల కారణాలపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని కూడా స్పష్టం చేసింది. ఇద్దరి జీవితాలు భవిష్యత్తులో ప్రశాంతంగా, సంతోషంగా సాగాలని కోరుకుంటున్నట్లు ఆమె వివరించింది. మైదానంలో తిరిగి స్థానం సంపాదించేందుకు శ్రమిస్తున్న ఈ బ్యాటర్‌కు వ్యక్తిగత జీవితంలోనూ ఇలాంటి ప్రతికూల వార్త ఎదురుకావడం గమనార్హం.
గతంలోనూ వీరి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వినిపించినా.. అవి రూమర్స్ అంటూ కొట్టిపారేశారు ఆకృతి అగర్వాల్. మేం ప్రశాంతంగానే ఉన్నాంటూ అప్పట్లో క్లారిటీ ఇచ్చింది. కానీ నేడు ఇన్ స్టాలో ఓ మెసేజ్‌పోస్ట్ చేసి క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమ్స్ నిజమేనని తెలిసింది. మరి పృథ్వీ షా దీనిపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. టీమిండియా తరపున ఓ వెలుగు వెలగాల్సిన ఈ యువ ప్లేయర్.. ఫాం లేమికి తోడు వరుస వివాదలతో కెరీర్ పూర్తిగా నాశనమైందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
