కమర్షియల్ రిఫ్రిజిరేషన్ ప్రోడక్టులలో అగ్రగామిగా ఉన్న రాక్ వెల్… హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నూతన ఫ్రాంచైజ్ స్టోర్‌ను ప్రారంభించింది. MR ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ రవిచంద్రారెడ్డి తో కలిసి రాక్వెల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ఈ స్టోర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్ గుప్తా మాట్లాడుతూ… “ఈ నూతన స్టోర్ ద్వారా అత్యున్నత మరియు వినూత్న ఫ్రీజింగ్ టెక్నాలజీ కలిగిన ఫ్రీజర్లు, వాటర్ కూలర్లు, వాటర్ డిస్పెన్సర్లు, బార్ రిఫ్రిజిరేషన్ యూనిట్లు, మిఠాయి షో కేస్లు, పోర్టబుల్ కార్ రిఫ్రిజిరేటర్ల వంటి శీతలీకరణ ఉత్పత్తులను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందించనున్నాం” అని తెలిపారు.
1986లో స్థాపించబడిన రాక్వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేడు దేశంలోనే ప్రముఖ వాణిజ్య శీతలీకరణ సామగ్రి తయారీదారుగా ఆవిర్భవించింది. ISO 9001:2015 సర్టిఫికేట్ పొందిన ఈ సంస్థ, ఇది CFC రహిత ఉత్పత్తులు, యూటెక్టిక్ కూలర్లు, ఫ్రీజర్లు, గ్రీన్ ఫ్రీజర్లు మరియు హైబ్రిడ్ సోలార్ ఫ్రీజర్లు వంటి అనేక ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది.
మారుతున్న గృహ, వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని, రోజు రోజుకి అప్డేట్ అవుతున్న టెక్నాలజీని అందుపుచ్చుకొని శీతలీకరణ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా నిలిచింది. 12 బ్రాంచ్‌లు 140 కంటే ఎక్కువ ఉత్పత్తులతో రాక్వెల్ సంస్థ దేశం నలుమూలల విస్తరించింది. వాణిజ్య శీతలీకరణ ఉత్పత్తులు దాదాపు 1500 వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉంది. రాక్వెల్ ఇప్పటికే.. కోకాకోలా, అమూల్, పెప్సీ, స్కూప్స్, మస్కథి, మధర్ డైరీ వంటి కంపెనీలకు రిఫ్రిజిరేటర్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని స్టోర్స్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.