Medicover Fertility: హైదరాబాద్‌లో మెడికవర్ ఫెర్టిలిటీ ప్రత్యేకమైన హెల్త్ క్యాంప్‌.. వీటిపై భారీ తగ్గింపు

| Edited By: Basha Shek

Nov 11, 2024 | 11:45 PM

Medicover Fertility: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రకరకాల అనారోగ్య సమస్యలు దరిచేరుతున్నాయి. ముఖ్యంగా చాలా మందికి సంతానోత్పత్తి సమస్యలు వెంటాడుతున్నాయి. వివిధ రకాల పరీక్షలు చేయించుకోవాలంటే ఖర్చు కూడా భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మెడికవర్ ఫెర్టిలిటీ ప్రత్యేక హెల్త్‌ క్యాంప్‌ను నిర్వహిస్తోంది. ఈ హెల్త్‌ క్యాంప్‌లో అన్ని రకాల పరీక్షలు, డాక్టర్‌ కన్సల్‌టెంట్‌ ఫీజులలో 50 శాతం తగ్గింపు పొందవచ్చు..

Medicover Fertility: హైదరాబాద్‌లో మెడికవర్ ఫెర్టిలిటీ ప్రత్యేకమైన హెల్త్ క్యాంప్‌.. వీటిపై భారీ తగ్గింపు
Medicover
Follow us on

మెడికవర్ ఫెర్టిలిటీ, సంతానోత్పత్తి పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ హైదరాబాద్‌లోని తమ హై-టెక్ సిటీ క్లినిక్‌లో 16 నవంబర్ 2024 శనివారం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ ఆరోగ్య శిబిరం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నిర్వహించనుంది. ఈ కార్యక్రమం జంటలకు సంతానోత్పత్తి ఆరోగ్య సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అనేక రోగనిర్ధారణ పరీక్షలు, కన్సల్‌టెంట్‌ ఫీజు తగ్గింపు ధరలతో అందించనున్నారు.

ఈ హెల్త్‌ క్యాంప్‌లో ఏయే ప్రయోజనాలు:

మహిళల కోసం: ఈ హెల్త్‌ క్యాంప్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.శిబిరానికి హాజరయ్యే మహిళలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (CBP), హేమోగ్రామ్, ప్రోలాక్టిన్, రాండమ్ బ్లడ్ షుగర్ (ఉపవాసం), థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH), యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH) సహా అవసరమైన పరీక్షలపై 50% తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు అదనంగా మహిళలు ఎలాంటి ఫీజు లేకుండా వైద్య నిపుణులను సంప్రదింపులతో పాటు ఉచిత సంతానోత్పత్తికి సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి ప్రయోజనం పొందుతారు.

పురుషుల కోసం:

పురుషులు CBPపై పరీక్షపై 50% తగ్గింపును పొందుతారు. అలాగే ఉచిత స్పెషలిస్ట్ సంప్రదింపులు, ఉచిత వీర్య పరీక్షలు ఉండనున్నాయి. ఈ పరీక్షలు ఆరోగ్యం, సంతానోత్పత్తి విషయంలో కీలకంగా మారనున్నాయి.

జంటల కోసం:

సంతానోత్పత్తికి సంబంధించి పరీక్షలపై జంటలు 50% తగ్గింపును పొందవచ్చు. అలాగే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ (IUI) విధానాలపై 50% తగ్గింపు, అలాగే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF)పై ఏకంగా రూ.20,000 వరకు తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు. ఈ హెల్త్‌ క్యాంప్‌లో వివిధ సమస్యలపై నిపుణులు అందుబాటులో ఉంటారు.

ఈ శిబిరంలో సంతానోత్పత్తికి సంబంధించిన స్పెషాలిస్ట్‌తో సంప్రదింపులు ఉంటాయి:

  • డాక్టర్ నిధి శర్మ – MBBS, MD, DNB (ప్రసూతి & గైనకాలజీ), న్యూ ఢిల్లీలోని ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ (IFS) నుండి క్లినికల్ ARTలో డిప్లొమా పొందారు.
  • డాక్టర్ కె మాధురి – MS, FRM (OSHERM), OBG (గాంధీ), ఫెర్టిలిటీ సొల్యూషన్స్‌లో కన్సల్టెంట్.

ఈ ఈవెంట్ వ్యక్తులు, జంటలు సంతానోత్పత్తి నిపుణులను (Fertility Specialists) సంప్రదించడానికి, అలాగే తక్కువ ధరలో అధునాతన సంతానోత్పత్తి నిర్ధారణలు, చికిత్సలను యాక్సెస్ చేయడానికి ఇది విలువైన అవకాశం.

మరింత సమాచారం కోసం- వినోద్: +91 7669406742 సంప్రదించవచ్చు.