ఘనంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిల్వర్ జుబ్లీ కార్యక్రమం.. పలువురి ఉద్యోగులకు సత్కారం

|

Dec 05, 2024 | 6:08 PM

ప్రముఖ పీడియాట్రిక్ మల్టీస్పెషాలిటీ, పెరినాటల్ హాస్పిటల్ 'రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్' తన 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 1న..

ఘనంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిల్వర్ జుబ్లీ కార్యక్రమం.. పలువురి ఉద్యోగులకు సత్కారం
Rainbow Childrens Hospital1
Follow us on

ప్రముఖ పీడియాట్రిక్ మల్టీస్పెషాలిటీ, పెరినాటల్ హాస్పిటల్ ‘రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి’ తన 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 1న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఒక కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. సదరు హాస్పిటల్ చైర్మన్, ఎండీ రమేష్ కంచర్ల, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతి రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హాస్పిటల్స్ నిర్వహణ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఇతర ప్రముఖ డాక్టర్లు, నర్సులతో సహా 4000 మందికి పైగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రాత్రింబవళ్లు శ్రమించే డాక్టర్లు ఈ కార్యక్రమంలోని స్కిట్‌లు, ర్యాంప్ వాక్‌లో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాకుండా తమ హాస్పిటల్స్ చైన్‌లో 15 సంవత్సరాలకు పైగా సేవలందించిన 37 మంది ఉద్యోగులను సత్కరించారు రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గ్రూప్ ఎండీ రమేష్ కంచర్ల. అలాగే ఈ 25 సంవత్సరాల ప్రయాణానికి గుర్తుగా ‘రెయిన్‌బో ఎంథమ్’ పేరిట ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్‌ను రిలీజ్ చేశారు. అటు ఈ కార్యక్రమంలో 100 మంది రెయిన్‌బో సంస్థ ఉద్యోగులతో కూడిన లఘుచిత్రాన్ని కూడా ప్రసారం చేశారు. మరోవైపు సంస్థ ఉద్యోగులందరూ కూడా 1999వ సంవత్సరం నుంచి తమకు ఎదురైన పలు తీపి జ్ఞాపకాలను ఐకానిక్ ఫోటోగ్రాఫ్‌ల ద్వారా గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల మాట్లాడుతూ.. ‘ఈ సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమం.. ఇన్నాళ్లూ మా ఉద్యోగులందరూ చేసిన కృషి, ప్రతిభ, అచంచలమైన నిబద్ధత, టీమ్‌వర్క్‌కి నిదర్శనమన్నారు. మేము మా క్లినికల్ ఎక్సలెన్స్, చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం, చక్కటి సహాయక సిబ్బంది ద్వారా మిలియన్ల కుటుంబాలలో నవ్వులు కురిపించాం. మేము మా అంకితభావం, దృఢత్వంతో మరింత ఎత్తుకు ఎదుగుతామని భావిస్తున్నట్టు తెలిపారు.

రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చరిత్ర:

1999వ సంవత్సరంలో ఏర్పాటైన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్స్, ప్రసూతి, గైనకాలజీ, సంతానోత్పత్తికి సంబంధించి ఆస్పత్రులను దేశంలోని వివిధ నగరాల్లో నెలకొల్పింది. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో, రెయిన్‌బో తన అధునాతన మౌలిక సదుపాయాలు, నిపుణుల సంరక్షణ ద్వారా పిల్లల కాలేయ మార్పిడి, మూత్రపిండ మార్పిడి, BMT వంటి క్వాటర్నరీ కేర్ సేవలతో సహా అసాధారణమైన ఆరోగ్య సంరక్షణ సేవలను స్థిరంగా అందిస్తోంది. ఈ బృందం దేశవ్యాప్తంగా 19 ఆసుపత్రులు, 4 క్లినిక్‌లను నిర్వహిస్తోంది. ముఖ్యంగా, హాస్పిటల్ చైన్‌లో ప్రత్యేకమైన పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ సెంటర్- రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌లో ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..