Smartphone users: ఒక్కొక్కరు ఒక్కో రకం.. వాడే విధానాన్ని బట్టి స్మార్ట్‌ఫోన్స్ మనుషుల వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయ్..

|

Jun 22, 2022 | 5:10 PM

ఇప్పుడూ స్మార్ట్‌ఫోన్ లేని మనిషి అంటూ లేడు. అన్ని వయస్సుల వాళ్లు ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అయితే అందరూ ఒకేలా ఫోన్లు వాడరు. యూజ్ చేసే విధానం వేరుగా ఉంటుంది.

Smartphone users: ఒక్కొక్కరు ఒక్కో రకం.. వాడే విధానాన్ని బట్టి స్మార్ట్‌ఫోన్స్ మనుషుల వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయ్..
Image used for representational purposes (Photo credit: Corning Incorporated)
Follow us on

ఫోన్లు కేవలం కాల్ చేయడానికి ఉపయోగించే రోజులు ఎప్పుడో పోయాయి. ఫోన్‌లు ప్రజల జీవితంలో అంతర్భాగం అయిపోయాయి. ఫోన్లు లేకుండా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే వాటిని ఉపయోగించే విధానం మన వ్యక్తిత్వ లక్షణాలను బాగా ప్రతిబింబిస్తుంది. మనలో చాలామంది  ఫోన్‌లను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. కొందరు ఫోన్లు ఎక్కడపడితే అక్కడ పెడుతుంటారు. కొందరైతే దాదాపు రోజులో 12 నుంచి 15 గంటలు ఫోన్‌ వాడుతారు. ఫోన్‌లు, వాటిని వినియోగించే మనుషులు ఎంత వైవిధ్యభరితంగా ఉన్నప్పటికీ, మనలోప్రతి ఒక్కరూ ఈపరికరాలకు ప్రత్యేక కనెక్షన్‌ని కలిగి ఉంటారు. వ్యక్తులు తమ ఫోన్‌లను ఉపయోగించే వివిధ మార్గాలద్వారా విభిన్న వ్యక్తిత్వాలు ఎలా ప్రతిబింబిస్తాయో చూద్దాం..

పాకెట్ ఫోన్..

ఈ గ్రూప్‌లోని వారు తమ ఫోన్ కవర్లను స్పేస్ రాకెట్స్‌గా భావిస్తారని చెప్పవచ్చు. డబ్బుతో పాటు,  పలు రసీదులు, ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు కార్డులు అన్ని సేఫ్‌గా ఫోన్‌ వెనకవైపు ఉంచుకుంటారు. దీంతో అవసరమైనప్పుడు సులభంగా వాటిని జిరాక్స్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

కాస్త ఎక్కువ కేర్…

కొంతమంది వ్యక్తులు తమ ఫోన్‌లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంత జాగ్రత్తగా అంటే డిస్‌ప్లేకు గోరిల్లా గ్లాస్‌, భారీ ఫోన్ కవర్ వంటి వాటిని వినియోగిస్తారు. ఇలాంటి వారు ఫోన్లను చిన్నపిల్లలా చూసుకుంటారు.

సీరియల్ సర్ఫర్స్

మనలో చాలామంది సీరియల్ సర్ఫర్స్‌ ఉంటారు. ఎందుకంటే వారు ఫోన్‌లకు ఎప్పుడూ వెంటే ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఎంతగా అంటే వాష్‌రూమ్‌కి వెళ్తే అక్కడికి కూడా ఫోన్ పట్టుకెళ్తారు. అంటే వారి ఫోన్‌లు ఎప్పుడూ వారితోనే ఉంటాయి.

క్యాజువల్ కీపర్స్

వీరు ఫోన్ల గురించి పెద్దగా భయపడరు.  ఫోన్లను చాలా సింఫులుగా తీసుకుంటారు. కవర్లు ఉండవు. స్క్రీన్ గార్డ్స్ ఉండవు. ఇలాంటి వారు ఫోన్‌లను బాక్స్ నుంచి ఎలా బయటకు తీశారో అలానే యూజ్ చేస్తారు. ఇలాంటి వారు ఫోన్ కొనేటప్పుడు కాస్త తెలివిగా ఆలోచించి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రూపొందించిన ఫోన్‌లను ఎంచుకుంటారని చెప్పవచ్చు.

ఫ్యాన్సీ ఫ్లిప్పర్స్

ఫ్యాన్సీ ఫ్లిప్పర్లు తమ ఫోన్‌లను ఉపయోగించినప్పుడు క్లాసీ వైబ్‌లను స్ప్రెడ్  చేస్తారు. అంతుకు కారణం వారు తమ ఫోన్లకు అతికించిన చిక్ పిక్ కవర్స్. అంటే ఫోన్లకు పైన వినియోగించే కవర్స్ అనమాట. ఇలాంటి వారు తమ ఫోన్‌లను యూజ్ చేసిన అనంతరం తిరిగి ఆ కవర్‌ను యథావిధిగా మూసివేస్తారు.

మీకు క్లియర్ కట్ వివరణ కావాలంటే  ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ సత్య థారే  చేసిన ఈ షార్ట్ వీడియోపై ఓ లుక్కేయండి…

(Sponsored Article)

మరిన్ని ఇంట్రస్టింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి