మారుతోన్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త కోర్సులను ప్రవేశపెడుతూ, విద్యార్థులను పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండేందుకు కృషి చేస్తున్న అమృత విశ్వ విద్యాపీఠం మరో కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. అమృత విశ్వ విద్యాపీఠం అత్యుత్తమ విద్యను అందిస్తూ దేశంలోనే టాప్ యూనిటర్సిటీలో ఒకటిగా దూసుకుపోతోంది. ఇటీవల ప్రకటించిన NIRF 2023 ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో నిలిచిన ఈ వర్సిటీ తాజాగా కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. డేటా సైన్స్ విత్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ పేరుతో రెండేళ్ల ఎమ్ఎస్‌సీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. అమృత స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు.
లాజిస్టిట్స్, డేటా అనాలిటిక్స్, మార్కెటింగ్ అనాలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న అంశాల్లో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. కేవలం థియరీకి మాత్రమే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ప్రత్యేక ప్రోగ్రామ్‌ను రూపొందించారు. సమ్మర్, వింటర్ వెకేషన్స్‌లో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ట్రైనింగ్ శిక్షణ ఏర్పాటు చేస్తారు. లాజిస్టిక్స్‌తో పాటు సరఫరా చైన్ నిర్వహణలో ఉండే సంక్షిష్ట సమస్యలను విశ్లేషించడానికి అసవరమయ్యే నైపుణ్యాలను ఈ కోర్సులో నేర్పిస్తారు.
అమృత స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. మహదేవన్ కొత్త కోర్సుకు సంబంధించి మాట్లాడుతూ.. ‘సప్లై చైన్ వ్యవస్థలో నైపుణ్యం కలిగిన విద్యార్థులను అందించడమే ఈ కోర్సు ముఖ్య లక్ష్యం. ఈ కోర్సులో చేరాలనుకునే వారు బీఎస్‌సీ మ్యాథమెటిక్స్/స్టాటస్టిక్స్, బీఎస్‌సీ కంప్యూటర్ సైన్స్, బీఈ/బీటెక్ (సీఎస్‌ఈ/మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్)లో ప్రతీ సబ్జెక్ట్‌లో 50 శాతం, మొత్తం కలిపి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2023 ఆగస్టు నుంచి ఈ కోర్సు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని’ తెలిపారు.
ఇక అమృత విశ్వా విద్యాపీఠం విషయానికొస్తే ఈ వర్సిటీ న్యాక్ గుర్తింపు కలిగి ఉంది. 2023లో దేశంలోనే అత్యుత్తమ వర్సిటీల్లో 7వ స్థానంలో నిలిచిందీ వర్సిటీ. అలాగే ప్రైవేటు వర్సిటీల్లో మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఈ వర్సిటీకి యూనెస్కో నుంచి లింగ సమానత్వం, మహిళా సాధికారికతల్లో గుర్తింపు కూడా పొందింది. ఈ వర్సిటీ హెడ్ క్వార్టర్స్ కొయంబత్తూర్‌లో ఉండగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 6 క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ వర్సిటీ 200కిపైగా ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలో ఎమ్‌ఓయూ చేసుకుంది. వీటిలో హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, కింగ్స్ కాలేజీ లండన్, రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మరెన్నో దిగ్గజ విద్యా సంస్థలు ఉన్నాయి.