Telugu News Spiritual Thursday Puja Tips: Lord Vishnu Puja Rituals and to get lord vishnu blessing
Thursday Puja Tips: పనుల్లో ఆటంకాలా, ఆర్ధిక ఇబ్బందులా.. గురువారం ఈ పరిహారాలు చేయండి.. శుభ ఫలితాలు మీ సొంతం..
హిందూ మతంలో వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. గురువారం విష్ణువు ఆరాధనకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున నియమ నిష్టల ప్రకారం శ్రీ హరిని పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ రోజు గురువారం చేయాల్సిన పూజకు సంబంధించిన ప్రత్యేక పరిహారాలను గురించి తెలుసుకుందాం.
హిందూ మతంలో గురువారం విష్ణువుకు, నవ గ్రహాల్లో బృహస్పతి కి అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణువుని పూజించడం అత్యంత ఫలవంతమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువును పూజించడం ద్వారా ఒక వ్యక్తికి ఆనందం, శ్రేయస్సు, ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. గురువారం ఉపవాసం ఉండటం వల్ల భక్తుడి కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో విజయానికి ఆటంకాలు ఎదురవుతున్న వారు లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా పురోగతికి ఆటంకాలు ఎదురవుతున్న వారు గురువారం విష్ణువు, బృహస్పతిని పూజించాలి. నారాయణుడిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుందని .. మీకు సంపద, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. గురువారం పూజ విధానం, విష్ణువు అనుగ్రహం కోసం చేయాల్సిన దోషరహిత పరిహారాలు, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం అని నమ్ముతారు. కనుక గురువారం తులసి పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తులసి లేని శ్రీ హరి పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కనుక గురువారం రోజున శ్రీ విష్ణువును పూజించే సమయంలో తులసి దళాలను సమర్పించండి.
ఏదైనా దేవుడిని లేదా దేవతను పూజించేటప్పుడు మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి.. గురువారం రోజున తులసి మాలతో ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వలన శ్రీ మహా విష్ణువు త్వరగా అనుగ్రహిస్తాడని నమ్ముతారు.
ఎవరైనా వివాహంలో పదే పదే అడ్డంకులను ఎదుర్కొంటుంటే.. లేదా సంబంధం స్థిరపడిన తర్వాత చెడిపోతుందంటే గురువారం రోజున విష్ణువును పూజించాలి. ఈ రోజున ఉపవాసం ఉండాలి. ఈ రోజున విష్ణువు లేదా వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి ఆయనకు పసుపు పువ్వులు, పసుపు మిఠాయిలు సమర్పించండి. ఇలా చేయడం వలన భక్తుడి సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
గురువారం రోజున రావి చెట్టు, అరటి చెట్టు, తులసి మొక్కను పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల భక్తుడికి ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తీరతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావు.
వీలైతే గురువారం రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి. అంతేకాదు పూజ చేసే సమయంలో పసుపు రంగు ఆసనం మీద కూర్చోండి. ఈ పరిహారాలను చేయడం వలన భక్తుల జీవితంలో దేనికీ కొరత ఉండదని.. జీవితంలో సమస్యలు ఎదురవ్వవని నమ్ముతారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.