Sadhu Amar Bharti: మనిషా, దేవుడా?.. 48 ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించని సాధువు.. షాకింగ్ వీషయాలు మీకోసం..

|

Dec 09, 2021 | 9:56 AM

Sadhu Amar Bharti: ఎవరైనా చెయ్యి ఎత్తితే ఓ పది నిమిషాల్లో దించేయక తప్పదు. అంతకంటే ఎక్కువ సేపు చెయ్యి అలా ఎత్తినప్పుడు రక్త ప్రసరణ సమస్య వస్తుంది.

Sadhu Amar Bharti: మనిషా, దేవుడా?.. 48 ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించని సాధువు.. షాకింగ్ వీషయాలు మీకోసం..
Sadhu
Follow us on

Sadhu Amar Bharti: ఎవరైనా చెయ్యి ఎత్తితే ఓ పది నిమిషాల్లో దించేయక తప్పదు. అంతకంటే ఎక్కువ సేపు చెయ్యి అలా ఎత్తినప్పుడు రక్త ప్రసరణ సమస్య వస్తుంది. దాని వల్ల తిమ్మిర్లు వస్తాయి. దాంతో సచ్చినట్లు చెయ్యి దించాల్సి వస్తుంది. కానీ ఈ సాధువు పట్టుదల ముందు.. అదేమీ పని చేయలేదు. పంతం పట్టి మరీ ఎత్తిన చెయ్యిని 48 ఏళ్లుగా దించడం లేదు. 1973లో కుడి చెయ్యి ఎత్తిన ఆయన, అప్పటి నుంచి దాన్ని అలాగే ఉంచారు. ఇది చూసిన చాలా మంది ప్రజలు, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. మనుషులకు ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

సాధువు పేరు అమర భారతి. ప్రపంచ శాంతి నెలకొనాలన్నది ఆయన ఆశయం. అందుకోసమే చెయ్యి ఎత్తారు. ప్రపంచ శాంతి కోసం తాను చెయ్యి ఎత్తుతున్నాననీ.. ఇక దాన్ని దింపేది లేదంటూ ఆ సాధువు పరమేశ్వరుడికి మొక్కుకున్నారట. అమర భారతి గతంలో ఇలా ఉండేవారు కాదని తెలిసినవాళ్లు చెబుతున్నారు. అసలు సన్యాసి అయ్యే ఆలోచనే ఆయనకు లేదట. అసలు విషయం ఏంటంటే ఆయన ఓ బ్యాంక్ ఉద్యోగి. ఆయనకు కూడా అందరిలాగే భార్య, పిల్లలు ఉన్నారు. అయితే, హఠాత్తుగా ఓ రోజు ఆయన పూర్తిగా మారిపోయారు. దైవత్వం వైపు అడుగులు వేశారు. తాను సన్యాసిగా మారుతున్నట్లు ప్రకటించి తన జీవితాన్ని ఆ ఆది శంకరుడికి అంకితం చేశారు.

తాను ఇలా చెయ్యి ఎత్తి ఉంచగలగడం దైవ మహిమే అంటున్నారు అమరభారతి. చెతి ఎత్తిన కొత్తలో ఆయన రకరకాల నొప్పులు భరించారట. చాలా కాలం కీళ్లనొప్పులు వేధించాయని తెలిపారు. ఐతే కాలక్రమంలో ఆ చెయ్యి అలాగే ఉండిపోయింది. నిజంగా అమరభారతి లో ఏదో శక్తి ఉంది కదా అని అంతా అనుకుంటున్నారు.

Also read:

 Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..

Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..