AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం దేవస్థానంలో భారీ ప్రక్షాళన.. పెద్ద ఎత్తున ఉద్యోగులకు స్థాన చలనం..!

శ్రీశైలం దేవస్థానంలో వరుస వివాదాల నేపథ్యంలో భారీ ప్రక్షాళన ప్రారంభమైంది. పరిపాలనలో సమర్థత, పారదర్శకత కోసం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు 37 మంది ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పులు దేవస్థానం దైనందిన కార్యకలాపాల్లో మెరుగైన సమన్వయాన్ని తీసుకువస్తాయని అంచనా. నూతన స్థానాల్లో వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.

శ్రీశైలం దేవస్థానంలో భారీ ప్రక్షాళన.. పెద్ద ఎత్తున ఉద్యోగులకు స్థాన చలనం..!
Srisailam Temple
Balaraju Goud
|

Updated on: Aug 27, 2026 | 7:01 AM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో వరుస వివాదాల నేపథ్యంలో భారీ స్థాయిలో అంతర్గత బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. పరిపాలనలో మార్పులు, విధుల నిర్వహణలో సమన్వయం కోసం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు 37 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ స్థాయి అధికారి నుంచి అటెండర్, హెల్పర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వరకు వివిధ కేటగిరీలకు చెందిన సిబ్బంది ఈ బదిలీల్లో ఉన్నారు.

దేవస్థానం పరిపాలన సౌలభ్యం, విధుల సమర్థవంతమైన నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ అంతర్గత బదిలీలు చేపట్టినట్లు ఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాలు, స్థానాల్లోకి మార్చడంతో పరిపాలనా వ్యవస్థలో కొత్త సమీకరణాలు చోటుచేసుకోనున్నాయి.

బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే సంబంధిత ఉద్యోగులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల నుంచి రిలీవ్ అయి, ఉత్తర్వుల్లో కేటాయించిన నూతన స్థానాల్లో వెంటనే విధుల్లో చేరాలని ఈఓ స్పష్టం చేశారు. ఉద్యోగుల విధుల మార్పు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని అధికార యంత్రాంగం ఆదేశించింది.

ఇటీవల శ్రీశైలం దేవస్థానంలో పలు అంశాలు వివాదాలకు దారితీసిన నేపథ్యంలో తాజా బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధతో ఈ బదిలీల ప్రక్రియను నిర్వహించినట్లు ఉద్యోగుల వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. మొత్తంగా 37 మంది ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలతో శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ మార్పుల అనంతరం దేవస్థానం రోజువారీ పరిపాలన, ఉద్యోగుల విధుల నిర్వహణలో మరింత సమన్వయం ఏర్పడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది..!

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సారీ నాన్న.. ఈ అప్పడు తీర్చడం నావల్ల కావట్లేదు..
సారీ నాన్న.. ఈ అప్పడు తీర్చడం నావల్ల కావట్లేదు..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..