Ayodhya Ram Mandir: అయోధ్యలో చక చకా రామమందిరం నిర్మాణ పనులు.. శాటిలైట్ ఫోటోలు విడుదల..

|

Jun 30, 2021 | 11:34 PM

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి..

Ayodhya Ram Mandir: అయోధ్యలో చక చకా రామమందిరం నిర్మాణ పనులు.. శాటిలైట్ ఫోటోలు విడుదల..
Ayodhya Ram Temple
Follow us on

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తాజాగా ఉపగ్రహ చిత్రాలు విడుదల చేశారు. ఈ ఫోటోలో ఆలయ నిర్మాణ పనులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గూగుల్ ఎర్త్ నుండి వచ్చిన ఈ ఫోటోల్లో.. ఆలయం నిర్మాణంలో భాగంగా తవ్వకాలు చేయడం, ఇతర నిర్మాణ పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కాగా, రామాలయం ఏళ్ల పాటు పటిష్టంగా ఉండేందుకు భూమిలోపల 40 అడుగుల నుంచి కాంక్రీట్ పోస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. మొత్తం 45 కాంక్రీట్ లేయర్స్ వేసిన తరువాత.. వాటిపై రామాలయం గర్భగుడి నిర్మాణం చేపట్టనున్నారు. 12 ఫీట్ల ఎత్తైన వేదికపై ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతుంది. కాగా, రామాలయం నిర్మాణం కోసం చేపట్టిన ఫౌండేషన్‌లో శ్రీరామునికి సంబంధించిన అవశేషాలు, పురాత విగ్రహాలను చెక్కుచెదరకుండా భద్రపరిచారు.

అక్టోబర్ నాటికి ఫౌండేషన్ పనులు పూర్తి..
అయోధ్యలో రామాలయం ఫౌండేషన్ పనులు అక్టోబర్ చివరి నాటికి పూర్తవుతాయని రామ్ మందిర్ ట్రస్ట్ వెల్లడించింది. రెండో దశ పనులు డిసెంబర్‌లో ప్రారంభం అవుతాయన్నారు. రెండవ దశలో రాతి నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మీర్జాపూర్ గులాబీ రాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గులాబీ రాళ్ల కోసం ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రాళ్లను చెక్కడం, నిర్మాణ పనులన్నీ రామ జన్మభూమిలోనే జరుగుతాయని రామ్ మందిర్ ట్రస్ట్ ధర్మకర్త అనిల్ మిశ్రా తెలిపారు. మొత్తానికి అయోధ్య రామమందిరం 2024, మార్చి నాటికి సిద్ధమవుతుందని తెలిపారు.

Also read: Jagga Reddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమైన తరుణాన వనదేతల దర్శనానికి జగ్గారెడ్డి

ఐ ఫోన్ గేమ్ ఆడిన 7 ఏళ్ళ గడుగ్గాయి..బిల్లు చెల్లించేందుకు కారును అమ్మేసుకున్న తండ్రి..ఎక్కడంటే ?

రాహుల్ గాంధీతో నవ జ్యోత్ సింగ్ సిద్దు భేటీ… 48 గంటల్లో పంజాబ్ నేతకు కీలక పదవి ..?