Shiva The Adiyogi: భక్తులకు గుడ్‌న్యూస్.. త్వరలో శివ – ది ఆదియోగి పేరుతో యానిమేషన్ మూవీ!
పవిత్ర శ్రావణ మాసంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు శివభక్తులకు శుభవార్త చెప్పారు. జనాలంతా తొలి యోగాకు మూలపురుషుడిగా భావించే ఆ ఆదియోగి చరిత్రను త్వరలో యానిమేషన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాణానికి ఇప్పటికే గ్రాఫిక్ ఇండియా స్టూడియోస్‌తో ఒప్పందం కూడా కురినట్టు పేర్కొన్నారు.

పవిత్ర శ్రావణ మాసం నెలలో శివ భక్తులకు ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు యోగ సంప్రదాయంలో మొట్టమొదటి యోగిగా, యోగా మూలపురుషుడిగా భావించే ఆదియోగి చరిత్రను సరికొత్త యానిమేషన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ‘శివ – ది ఆదియోగి’ పేరుతో ఈ యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కుతున్నట్టు తెలిపారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో త్వరలో ప్రేక్షకుల ముందు రానున్నట్టు స్పష్టం చేశారు.
అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి తొలి అడుగు పడినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సిరీస్‌తో విశేష ఆదరణ పొందిచిన ప్రముఖ స్టూడియో గ్రాఫిక్ ఇండియాతో కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈశా వేదికగా సద్గురు వివరించిన యోగ జ్ఞానం, కథనాల ఆధారంగా అత్యున్నత స్థాయి యానిమేషన్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
రచన, నిర్మాణం: గ్రాఫిక్ ఇండియా సహ వ్యవస్థాపకుడు శరద్ దేవరాజన్ ఈ చిత్రానికి సహ రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఇయన గతంలో బాహుబలి ది లాస్ట్ లెజెండ్స్, ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ వంటి యానిమేషన్ చిత్రాలతో పాటు మార్వెల్ ఇండియన్ స్పైడర్‌మ్యాన్ చిత్రాలకు కూడా పనిచేశారు.
కథా నేపథ్యం: ఇక ఈ సినిమా నేపథ్యం వచ్చేసి యోగా ఎలా ఆవిర్భవించింది? ఆదియోగిగా శివుడు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక మార్గం ఏమిటి? అనే అంశాలను ఉద్వేగభరితమైన దృశ్యరూపంలో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా వీలైనంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
యోగ సంస్కృతిలో శివుడిని ఒక దేవుడిగా మాత్రమే కాదని.. ఆయన ఆదియోగి, ఆదిగురువు. ప్రకృతి నియమాలకు లోబడి ఉండటమే శాశ్వతం కాదని, సాధన ద్వారా ఆ పరిమితులను దాటి ముక్తి పొందవచ్చని మానవాళికి తెలియజేసిన మొదటి వ్యక్తి ఆయనేనని తెలిపారు. భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని, యోగ వారసత్వాన్ని సరికొత్త దృశ్యకావ్యంగా రాబోయే తరాలకు, అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సద్గురు తెలిపారు.
మరిన్ని ఆథ్యాత్మిక వార్తల కోసంఇ క్కడ క్లిక్ చేయండి.
