Success Mantra: కాలం జీవితంలోని అన్ని గాయాలను నయం చేస్తుంది.. సమయానికి చెందిన 5 విలువైన సూత్రాలు తెలుసుకోండి

|

Dec 12, 2022 | 7:01 PM

సమయం గురించి ఒక సామెత ఉంది.. సమయం జీవితానికి గొప్ప వైద్యుడు. కాలం వేసే మందుతో అన్నింటికీ నివారణ లభిస్తుంది. జీవితంలోని సరళత,  కష్టాల మధ్య తన లక్ష్యాన్ని సాధించే మార్గాన్ని నిర్ణయిస్తుంది.

Success Mantra: కాలం జీవితంలోని అన్ని గాయాలను నయం చేస్తుంది.. సమయానికి చెందిన 5 విలువైన సూత్రాలు తెలుసుకోండి
Quotes On Time Management
Follow us on

జీవితంలో డబ్బులు, ఆస్తులు ఇలా ఏమి కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు.. కానీ జీవితంలో కోల్పోయిన కాలాన్ని మాత్రం తిరిగి సంపాదించుకోలేము అని అంటారు పెద్దలు. మీ జీవితంలో మంచి, చేడు ఇలా ఏదైనా జరిగి ఉండవచ్చు లేదా జరిగే అవకాశం ఉంది. అయితే మంచి జరిగితే సంతోష పడి.. చెడు జరిగితే లేదా జరుగుతున్నట్లయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కాలానికి పైలట్ మీరే.. మంచితనం దానితో ముడిపడి కాలం ప్రయాణిస్తూ ఉంటుంది. ఎవరైనా కోరుకుంటే కాలాన్ని దుర్వినియోగం చేసుకోవడం ఆపవచ్చు. కాలాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. అయితే కొంతమంది తమకు అందించిన వచ్చిన అవకాశాలను వినియోగించుకోకుండా వదిలేస్తారు. తమ చేతికి వచ్చిన అవకాశాలను మంచి సమయాన్ని స్వాగతించరు. జీవితంలో ఇలా చేసే వారికి, భవిష్యత్తులో కాలమే గుణపాఠం నేర్పుతుంది.

ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు వస్తాయి, పోతుంటాయి. కొందరి జీవితంలో కొన్నిసార్లు మంచి లేదా చెడు సమయాలు మరికొన్ని రోజులు మిగిలిపోతాయి. అయితే జీవితం ఎప్పుడూ ఏదొక విషయంలో కాలం మారుతూ ఉంటుందనేది నిజం. సమయం గురించి ఒక సామెత ఉంది.. సమయం జీవితానికి గొప్ప వైద్యుడు. కాలం వేసే మందుతో అన్నింటికీ నివారణ లభిస్తుంది. జీవితంలోని సరళత,  కష్టాల మధ్య తన లక్ష్యాన్ని సాధించే మార్గాన్ని నిర్ణయిస్తుంది. సమయం విలువ తెలుసుకోవాలంటే సక్సెస్ సూత్రాలను గురించి తెలుసుకోవాల్సిందే..

  1. ఒక వ్యక్తి తనకు చాలా తక్కువ సమయం మిగిలి ఉన్నప్పుడు తన జీవితంలో సమయం విలువను బాగా అర్థం చేసుకుంటాడు.
  2. సమయం చాలా శక్తివంతమైనది. అది శిక్షను ప్రకటించినప్పుడు.. న్యాయం చేయడానికి న్యాయమూర్తి లేదా న్యాయవాది అవసరం  ఉండదు.
  3. ఇవి కూడా చదవండి
  4. సమయం ఉచితంగా లభించవచ్చు కానీ అది చాలా విలువైనది. మీరు సమయాన్ని దత్తత తీసుకోలేకపోవచ్చు.. అయితే మీరు ఖచ్చితంగా సమయాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు.
  5. సమయం అన్ని గాయాలను నయం చేస్తుంది. విషయాలను పరిపక్వం చేస్తుంది. సమయం వచ్చినప్పుడు..  ప్రతిదీ ఎప్పటికైనా సత్యాన్ని లోకానికి వెల్లడిస్తుంది. కాబట్టి కాలమే సత్యానికి మూలం.
  6. సమయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ విలువైన నాణెం. దీనిని ఎలా గడపాలో మీరు మాత్రమే నిర్ణయించగలరు. మీరు కాలం  గురించి జాగ్రత్తగా ఉండకపోతే.. ఖచ్చితంగా ఇతర వ్యక్తులు మీ కోసం మీ సమయాన్ని ఖర్చుచేయాల్సి ఉంటుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)