Shiva Pooja: కార్తీక మాసంలో శివుడిని ఇలా పూజిస్తే జన్మ ధన్యం.. తప్పక తెలుసుకోండి..

|

Nov 08, 2021 | 4:13 PM

Shiva Pooja: శివుడిని మీరు ఏ రోజైనా పూజించవచ్చు. కానీ కార్తీక మాసంలో వచ్చే సోమవారం చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు చేసే పూజకు చాలా ప్రతిఫలం దక్కుతుందని

Shiva Pooja: కార్తీక మాసంలో శివుడిని ఇలా పూజిస్తే జన్మ ధన్యం.. తప్పక తెలుసుకోండి..
Shiva Puja
Follow us on

Shiva Pooja: శివుడిని మీరు ఏ రోజైనా పూజించవచ్చు. కానీ కార్తీక మాసంలో వచ్చే సోమవారం చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు చేసే పూజకు చాలా ప్రతిఫలం దక్కుతుందని నమ్మకం. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే శివరాత్రి రోజు అందరు రకరకాల పదార్థాలతో అభిషేకిస్తారు. మహాదేవుడిని అభిషేకం ద్వారా సంతృప్తి పరిస్తే సకల సంపదలను ఇస్తాడని భక్తల విశ్వాసం. అయితే కార్తీక మాసంలోని మొదటి సోమవారం పూజ చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఏ వస్తువులతో పూజిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

1. ఆవు పాలను నైవేద్యంగా పెడితే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి
మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి మీరు శివుడికి తప్పనిసరిగా ఆవు పాలు సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.

2. గంగాజలంతో కోరికలు తీరుతాయి
శివారాధనలో గంగకు ప్రత్యేక స్థానం ఉంది. సోమవారం రోజు శివునికి గంగాజలం సమర్పించడం వల్ల జీవితానికి సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయని విశ్వాసం.

3. శివ ధ్యానం
మీరు శని సంబంధిత దోషంతో బాధపడుతున్నా, కాలసర్ప దోషం ఉన్నా బయటపడటానికి మీరు ప్రత్యేకంగా శివ ధ్యానం చేయాలి. వెంటనే శని దోషం తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం

4. శత్రువులపై విజయం
మీకు తెలిసిన లేదా తెలియని శత్రువుల నుంచి ప్రమాదంలో ఉంటే భయాన్ని అధిగమించడానికి మీరు ప్రత్యేకంగా శివ సాధన చేయాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపించాలి. మీకు ఎటువంటి ఆపదలు ఉన్నా తొలగిపోతాయి.

కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..

Pattabhiram: వైసీపీ ప్రభుత్వం తప్పిదాలను ఆధారాలతో సహా బయటపెడతాంః టీడీపీ నేత పట్టాభి

Balakrishna: మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్‏నేమ్.. బాలకృష్ణ అన్‏స్టాపబుల్‏ షో సెకండ్ గెస్ట్ ఎవరంటే..