కార్తీక మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున అంటే ఈరోజు దేవ్ దీపావళిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున విష్ణువు మత్స్య అవతారం ధరించి భూమిదేవిని కష్టం నుంచి రక్షించాడు. అంతేకాదు ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడినిసంహరించారు. కనుక కార్తీక పౌర్ణమి రోజున దేవతలు దేవ్ దీపావళి జరుపుకున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున సకల దేవతలు భూమిపై తిరుగుతారని విశ్వాసం. ఈ రోజున విష్ణు, లక్ష్మి దేవిని పూర్ణ క్రతువులతో పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు సాయంత్రం చేసే కొన్ని చర్యలు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాం?
జీవితంలోని సమస్యలను అధిగమించడానికి దేవ్ దీపావళి రోజున కొన్ని చర్యలు తీసుకోవాలి. అందులో ఒకటి శివకేశవులకు సంబంధించిన కథలు వినడం. దేవ్ దీపావళి రోజున సత్యనారాయణుని కథను వినడం లేదా వ్రతం చేయడం.. దీనివల్ల కష్టాలు నశించి జీవితంలో సంతోషం వస్తుందని నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవ్ దీపావళి రోజున పిండి దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు పిండితో ప్రమిద చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన అర్దిక ఇబ్బందులు తొలగుతాయని విశ్వాసం.
హిందూ మత విశ్వాసాల ప్రకారం, దేవ్ దీపావళి రోజున దీపం దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున దీపదానం చేయడం వల్ల విష్ణువు సంతోషిస్తాడు. దీపావళి రోజున నదీ తీరంలో లేదా ఆలయంలో పిండి దీపం వెలిగించి ఆ దీపదానం చేయాలని నమ్మకం. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగుతాయని విశ్వాసం.
దేవ్ దీపావళి రోజున తులసి మొక్కను పూజించడం శ్రేయస్కరం. తులసి మహావిష్ణువుకు ప్రీతికరమైనదని. అంతేకాదు తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే తులసి పూజ చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అంతేకాదు వ్యాపార, ఉద్యోగాలలో కూడా పురోగతి సాధిస్తారు.
దీపావళి మాదిరిగానే దేవ్ దీపావళి రోజున కూడా ఇంట్లో నువ్వులతో దీపాలను వెలిగించాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణానలను కట్టి.. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో అలంకరించాలి. ఇలా చేయడం వలన లక్ష్మి దేవి ఆశీర్వాదాన్ని అందిస్తుందని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు