Sabarimala Rush: శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శన వేళల్లో మార్పులు.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోన్న పంబా

|

Nov 25, 2022 | 6:40 AM

శబరిమలలో ఒక్కసారిగా భక్త జనం పెరిగింది. ఏ చెట్టు, ఏ కొండ చూసినా జనమే జనం. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోంది.

Sabarimala Rush: శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శన వేళల్లో మార్పులు.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోన్న పంబా
Sabarimala Rush
Follow us on

శబరి గిరులు భక్త జనంతో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తుల రద్దే కనిపిస్తోంది. ఆలయం అధికారులు దర్శనాల సమయం పెంచినా రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. స్వామి వారి దర్శనం కోసం దాదాపు 4 గంటల సమయం పడుతోంది. ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో గుడి తలుపులు తెరుచుకోవడంతో భక్తుల తాకిడి పెరిగిందంటున్నారు అధికారులు. శబరిమలలో ఒక్కసారిగా భక్త జనం పెరిగింది. ఏ చెట్టు, ఏ కొండ చూసినా జనమే జనం. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోంది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతోంది. చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయ్యప్పస్వాములు స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తున్నారు.

శబరిమలకు భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో పాటు కరోనా ఆంక్షలు లేకపోవడంతో రెండో భాగంలో దర్శన సమయాన్ని మార్చారు. ఇక నుంచి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకే స్వామి వారి దర్శనం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 16న శబరిమల ఆలయం తెరవగా.. సోమవారం వరకు 3 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చినట్టు చెప్పారు. సోమవారం ఒక్కరోజే 70 వేల మంది భక్తులు వచ్చారని పేర్కొన్నారు.

రెండేళ్ల తర్వాత కలిగిన దర్శన భాగ్యంతో శబరికి క్యూ కడుతున్న భక్తులకు గుడ్‌ న్యూస్‌. విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌. భక్తులు సంప్రదాయంగా తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్​ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. భక్తుల రద్దీ పెరిగేందుకు ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే.. ఎంత మంది వచ్చినా ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారు.

ఇవి కూడా చదవండి

మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ నెల​ 16న తెరుచుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్ పరమేశ్వరన్ నంబూదిరి ఆధ్వర్యంలో సాయంత్రం 5గంటలకు ఆలయాన్ని తెరిచారు. కరోనా సంబంధిత ఆంక్షలను ఉపసంహరించిన తర్వాత తొలి పూజ కూడా ఇదే అయింది. 41రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. మధ్యలో విరామం ఇచ్చి డిసెంబర్ 30న మకరజ్యోతి కోసం ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..