AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనుమాన్ చాలీసా పుట్టుక వెనుక అసలు కథ ఏమిటి? తులసీదాసు.. ఆంజనేయుడు రహస్య సంబంధం!

Hanuman Chalisa Origin: హనుమంతుడి నామస్మరణ మనకు ధైర్యం, భయం తొలగించే శక్తిని ఇస్తుంది. ఆపదల నుండి రక్షణ కలిగించే ఆంజనేయుడిని ప్రసన్నం చేసుకునే ప్రసిద్ధ స్తోత్రం హనుమాన్ చాలీసా. దీన్ని భక్తితో నిత్యం చదివితే ప్రతికూల శక్తులు దూరమవుతాయని, శని, రాహు–కేతు ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా పుట్టుక గురించి తెలుసుకుందాం.

హనుమాన్ చాలీసా పుట్టుక వెనుక అసలు కథ ఏమిటి? తులసీదాసు.. ఆంజనేయుడు రహస్య సంబంధం!
Hanuman Chalisa Origin
Rajashekher G
|

Updated on: May 11, 2026 | 12:07 PM

Share

హనుమంతుడు చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఎంతో భక్తితో ప్రేమతో పూజించే దేవుడు. ఆయన నామం పలికితే చాలు మనసులో కొండంత ధైర్యం వస్తుంది. ఎలాంటి భయాలనైనా పోగొట్టే హనుమంతుడి నామ స్మరణకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అలాగే, ఎలాంటి ఆపదల నుంచైనా రక్షణ ఇచ్చే శక్తిగా భావించే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకునే స్తోత్రాల్లో అత్యంత ప్రసిద్ధమైనది హనుమాన్ చాలీసా. దీనిని నిత్యం భక్తితో పఠిస్తే ప్రతికూల శక్తులు దూరమవుతాయని, శని, రాహు–కేతు వంటి గ్రహ ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

హనుమాన్ చాలీసా ఆవిర్భావ కథ

వారణాసిలో నివసించిన మహాభక్తుడు తులసీదాసు ఎల్లప్పుడూ శ్రీరామ నామస్మరణలో మునిగిపోయేవారు. ఆయన భక్తి ప్రభావంతో అనేక మంది రామనామ మార్గంలోకి వచ్చారు. ఇది కొందరికి అసహనాన్ని కలిగించడంతో, ఆయనపై అనవసర ఆరోపణలు చేసి ఢిల్లీ దర్బార్‌(అక్బర్)కు ఫిర్యాదు చేశారు. దీని కారణంగా తులసీదాసును రాజసభకు పిలిపించారు. అక్కడ ఆయనను రామనామ మహిమను నిరూపించమని పరీక్షించారు. అయితే తులసీదాసు, జీవన మరణాలు దైవాధీనమని చెప్పి అద్భుతాలు చూపించడానికి నిరాకరించారు. ఈ ధైర్యానికి కోపగించిన పాలకులు ఆయనను శిక్షించాలనుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తులసీదాసును విడిచిపెట్టాల్సి వచ్చింది. వాటి గురించి తెలుసుకుందాం.

తులసీదాసుకు దర్శనమిచ్చిన హనుమ

ఆ క్లిష్ట పరిస్థితిలో తులసీదాసు హృదయపూర్వకంగా ఆంజనేయుని ప్రార్థించారు. వెంటనే ఆశ్చర్యకరంగా వానర గణాలు సభలో ప్రత్యక్షమై అందరినీ భయభ్రాంతులను చేశాయి. ఆ కలకలం మధ్య తులసీదాసుకు హనుమంతుని దివ్య దర్శనం కలిగింది. ఆ పవిత్ర క్షణంలో ఆయన ఆంజనేయుని మహిమను స్తుతిస్తూ భక్తి భావంతో నలభై దోహాలతో కూడిన స్తోత్రాన్ని ఆశువుగా రచించారు. ఇదే తరువాత కాలంలో “హనుమాన్ చాలీసా”గా ప్రసిద్ధి చెందింది.

ఆంజనేయ స్వామి ఈ స్తోత్రానికి ప్రసన్నుడై, దీనిని పఠించే భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తానని వరం ఇచ్చినట్లు భక్తులు నమ్ముతారు. అప్పటి నుంచి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా స్తోత్రం భక్తి మార్గంలో అత్యంత పవిత్రమైన ప్రార్థనగా నిలిచింది. Hanuman Chalisa ఒక భక్తి కవిత మాత్రమే కాదు, అది హనుమంతుడి శక్తి మీద విశ్వాసాన్ని పెంచే ఆధ్యాత్మిక గ్రంథం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు ఆంజనేయుడు ఇచ్చిన వరం..
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు ఆంజనేయుడు ఇచ్చిన వరం..
నూనె వాడకుండా చిటికెలో చేసుకునే అమ్మమ్మలనాటి చేతి పచ్చడి
నూనె వాడకుండా చిటికెలో చేసుకునే అమ్మమ్మలనాటి చేతి పచ్చడి
కొబ్బరి నీళ్లు vs చెరుకు రసం.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
కొబ్బరి నీళ్లు vs చెరుకు రసం.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే..
రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే..
కేసీఆర్‌కు ఇష్టమైన కూర ఇదే.. ఇలా వండితే గిన్నెలు కూడా వదలరు
కేసీఆర్‌కు ఇష్టమైన కూర ఇదే.. ఇలా వండితే గిన్నెలు కూడా వదలరు
సూర్యకుమార్‎కు తొమ్మిదేళ్ల నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయా?
సూర్యకుమార్‎కు తొమ్మిదేళ్ల నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయా?
తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్
సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్
తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని ఏం చేశాడంటే?
తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని ఏం చేశాడంటే?
మీరు వాడే నెయ్యి మంచిదా.. కల్తీదా..? ఇంట్లోనే సింపుల్‌గా ..
మీరు వాడే నెయ్యి మంచిదా.. కల్తీదా..? ఇంట్లోనే సింపుల్‌గా ..