AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో వచ్చే 12 పౌర్ణమిల పూర్తి జాబితా ఇదే.. ఆ రోజుల్లో ఏం చేయాలో తెలుసా?

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏడాదిలో వచ్చే ప్రతీ పౌర్ణమికి విశేషమైన ప్రత్యేకత ఉంది. పౌర్ణమి రోజుల్లో అనేక ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాలు చేపడతారు. పౌర్ణమిని శుభదినంగా పరిగణిస్తారు. పౌర్ణమి రోజున మహా శివుడు, శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతం వంటి ఉపచారాలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెబుతారు. పౌర్ణమి రోజుల్లో చంద్రుడి ఆరాధనతో మానిసక ప్రశాంతతతోపాటు దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

2026లో వచ్చే 12 పౌర్ణమిల పూర్తి జాబితా ఇదే.. ఆ రోజుల్లో ఏం చేయాలో తెలుసా?
Full Moon
Rajashekher G
|

Updated on: Jan 02, 2026 | 10:15 AM

Share

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏడాదిలో వచ్చే ప్రతీ పౌర్ణమికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఆరోజు చేసే పూజ, దానాలతో అపారమైన పుణ్యం పొందడంతోపాటు జీవితంలో ప్రతికూలతలు తొలగిపోతాయని భావిస్తారు. పౌర్ణమి రోజును చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు. పౌర్ణమి రోజున ఆచరించే పవిత్ర స్నానం, సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష్మీపూజ, చంద్రుడి ఆరాధన, ఉపవాసాలు ఆధ్యాత్మిక పురోగతికి, జీవితంలో సానుకూల ప్రయోజనాలు పొందడానికి మార్గంగా భావిస్తారు. ఇక, 2026 సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణమి తిథులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

2026లో వచ్చే పౌర్ణమి తిథులు

జనవరి 3, 2026 శనివారం – పుష్య శుక్ల పౌర్ణమి

ఫిబ్రవరి 1, 2026, ఆదివారం – మాఘ శుక్ల పౌర్ణమి

మార్చి 3, 2026, మంగళవారం – ఫాల్గుణ, శుక్ల పౌర్ణమి

ఏప్రిల్ 1, 2026, బుధవారం – చైత్ర, శుక్ల పౌర్ణమి

మే 1, 2026, శుక్రవారం – వైశాఖ, శుక్ల పౌర్ణమి

మే 30, 2026, శనివారం- జ్యేష్ఠ, శుక్ల పౌర్ణమి

జూన్ 30 2026, బుధవారం – ఆషాఢ, శుక్ల పౌర్ణమి

ఆగస్టు 27, 2026, గురువారం – శ్రావణ, శుక్ల పౌర్ణమి

28 సెప్టెంబర్ 26, 2026, శనివారం – భాద్రపాద, శుక్ల పౌర్ణమి

అక్టోబర్ 25, 2026, ఆదివారం – ఆశ్వీయుజ, శుక్ల పౌర్ణమి

నవంబర్ 24, 2026, మంగళవారం – కార్తీక, శుక్ల పౌర్ణమి

డిసెంబర్ 23, 2026, బుధవారం- మార్గశిర్ష, శుక్ల పౌర్ణమి

పౌర్ణమి రోజున ఏం చేయాలి?

పౌర్ణమి రోజున చంద్రుడు(Moon)ని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. పౌర్ణమి రోజున రాగిపాత్రలో పాలు, నీళ్లు, పూలు, అక్షతలు, కొంచెం చక్కర కలిపి చంద్రోదయం సమయంలో అర్ఘ్యం సమర్పించాలి. ఓం చంద్రాయ నమ:, ఓం సోమాయ నమ: అనే మంత్రాలను అర్ఘ్యం సమర్పించేటప్పుడు పఠించాలి. ఈ మంత్రాలను 108 సార్లు జపిస్తే మరింత శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడిని మనస్ఫూర్తిగా ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని విశ్వాసం.

పౌర్ణమి రోజున మహా శివుడు, శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతం వంటి ఉపచారాలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఇక, పౌర్ణమి రోజున నదీస్నానం, దీపారాధన, ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని, పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఈ రోజు దానాలు చేస్తే మీరు ఎదుర్కొంటున్న అటంకాలు తొలగిపోయి.. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

Note: ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.

Follow Us
కొత్త 7 సీటర్‌ను కేవలం రూ.5.65 లక్షలకే.. తక్కువ ధరలో సూపర్ SUV..!
కొత్త 7 సీటర్‌ను కేవలం రూ.5.65 లక్షలకే.. తక్కువ ధరలో సూపర్ SUV..!
రేపే తెలంగాణ Polycet 2026 పరీక్ష.. ఒక్కనిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రేపే తెలంగాణ Polycet 2026 పరీక్ష.. ఒక్కనిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఇష్టంగా పుచ్చకాయ తింటున్నారా..? అయితే, ఈ విషయాలను తెలుసుకోండి
ఇష్టంగా పుచ్చకాయ తింటున్నారా..? అయితే, ఈ విషయాలను తెలుసుకోండి
చిన్నప్పుడు ఆ తెలుగు నటుడి ఇంట్లో దొంగతనం చేసిన సూర్య, కార్తీ
చిన్నప్పుడు ఆ తెలుగు నటుడి ఇంట్లో దొంగతనం చేసిన సూర్య, కార్తీ
సెకండ్‌ హ్యాండ్‌ AC వాడుతున్నారా? ఇది తెలుసుకోండి!
సెకండ్‌ హ్యాండ్‌ AC వాడుతున్నారా? ఇది తెలుసుకోండి!
సొంతిళ్లు లేని వారికి రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్..!
సొంతిళ్లు లేని వారికి రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్..!
మీరు గ్రేట్ టీచర్.. సామాన్య విద్యార్థులను ఫ్లైట్‌లో తీసుకెళ్లారు
మీరు గ్రేట్ టీచర్.. సామాన్య విద్యార్థులను ఫ్లైట్‌లో తీసుకెళ్లారు
రక్త హీనతను తరిమికొట్టే బీట్ రూట్ పాయసం
రక్త హీనతను తరిమికొట్టే బీట్ రూట్ పాయసం
పసిడి ప్రియులకు భారీ ఊరట.. రూ.31 వేల వరకు తగ్గిన బంగారం ధర..!
పసిడి ప్రియులకు భారీ ఊరట.. రూ.31 వేల వరకు తగ్గిన బంగారం ధర..!
ఐపీఎల్ హిస్టరీలో వింత రికార్డ్.. 18 ఏళ్లలో ఎన్నిసార్లు జరిగిందంటే
ఐపీఎల్ హిస్టరీలో వింత రికార్డ్.. 18 ఏళ్లలో ఎన్నిసార్లు జరిగిందంటే