AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్ పూజలో మహిళలు ముక్కు నుంచి నుదుటి వరకు సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? దీని రహస్యం ఇదే!

Chhath Puja Sindoor Significance Telugu: ఛత్ పూజలో వివాహిత మహిళలు ముక్కు నుంచి నుదుటి పాపిడి వరకు పొడవుగా నారింజ రంగు సింధూరం పెట్టుకోవడం మీరు గమనించారా? అసలు ఈ ప్రత్యేక సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం ఏమిటి? భర్త దీర్ఘాయుష్షు, సౌభాగ్యానికి సింధూరానికి ఉన్న సంబంధం, ఈ ఆచారం వెనుక కారణాలు తెలుసుకోండి.

ఛత్ పూజలో మహిళలు ముక్కు నుంచి నుదుటి వరకు సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? దీని రహస్యం ఇదే!
Chhath Puja Sindoor Significance Telugu
Rajashekher G
|

Updated on: Nov 14, 2026 | 8:30 PM

Share

Chhath Puja Sindoor Significance Telugu: 2026లో జానపద విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఛత్ పూజ నవంబర్ 13, శుక్రవారం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే ఈ మహా పర్వం నవంబర్ 16, సోమవారం ఉషా అర్ఘ్యం, పారణతో ముగియనుంది. ఈ పండుగలో సూర్య భగవానుడితో పాటు ఛఠీ మాతను పూజించడం విశేషం. ముఖ్యంగా మహిళలు తమ పిల్లల ఆయురారోగ్యాలు, కుటుంబ సుఖసంతోషాలు, భర్త దీర్ఘాయుష్షు కోసం కఠినమైన ఉపవాసం పాటిస్తారు.

ఛత్ పూజలో అనేక ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా వివాహిత మహిళలు ముక్కు నుంచి నుదుటి పాపిడి వరకు పొడవుగా నారింజ రంగు సింధూరం పెట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలు, ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

ఛత్ పూజలో ముక్కు నుంచి నుదుటి వరకు పొడవుగా సింధూరం ఎందుకు పెట్టుకుంటారు?

ఛత్ పూజ సమయంలో ఉపవాసం ఉండే వివాహిత మహిళలు పదహారు రకాల అలంకరణలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కొత్త వస్త్రాలు ధరించడం, చేతులకు గోరింటాకు పెట్టుకోవడం, నగలు ధరించడం, పాపిడిలో సింధూరం పెట్టుకోవడం ఇందులో భాగంగా ఉంటాయి. అయితే సాధారణ రోజుల్లో పెట్టుకునే సింధూరానికి భిన్నంగా, ఛత్ పూజ సమయంలో మహిళలు ముక్కు నుంచి నుదుటి పాపిడి వరకు పొడవుగా సింధూరం ధరిస్తారు.

ఇవి కూడా చదవండి

జానపద, మతపరమైన విశ్వాసాల ప్రకారం, ఇలా పొడవుగా సింధూరం పెట్టుకోవడం భర్త దీర్ఘాయుష్షుకు, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని మహిళలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. అంతేకాకుండా దాంపత్య జీవితంపై చెడు దృష్టి పడకుండా ఉంటుందని కూడా నమ్ముతారు.

నారింజ రంగు సింధూరానికే ఎందుకంత ప్రాధాన్యత?

ఛత్ పూజలో నారింజ లేదా ముదురు కాషాయ రంగు సింధూరం పెట్టుకోవడం వెనుక కూడా ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. హిందూ సంప్రదాయంలో కాషాయ రంగు శక్తి, తేజస్సు, పవిత్రత, శుభప్రదత్వానికి ప్రతీకగా భావిస్తారు. సూర్య భగవానుడు కాంతి, శక్తి, జీవానికి ఆధారంగా కొలవబడతాడు. ఛత్ పూజలో సూర్యుడిని ప్రధానంగా ఆరాధిస్తారు కాబట్టి, ఆయనకు ప్రతీకగా భావించే నారింజ రంగు సింధూరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.

వివాహిత మహిళలకు సింధూరం ఎందుకు ప్రత్యేకం?

హిందూ సంప్రదాయంలో సింధూరం సుమంగళిత్వానికి, వైవాహిక బంధానికి ప్రతీక. మహిళలు తమ భర్త క్షేమం, దీర్ఘాయుష్షు, దాంపత్య జీవితంలోని సంతోషం కోసం సింధూరాన్ని ధరిస్తారు. ఛత్ పూజ సమయంలో చేసే సూర్యారాధన, ఉపవాసం, సింధూర ధారణ.. ఇవన్నీ కుటుంబ శ్రేయస్సు పట్ల మహిళలకు ఉన్న భక్తి, ప్రేమ, విశ్వాసాన్ని తెలియజేస్తాయి.

ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఈ సంప్రదాయాన్ని మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. ఇలా ముక్కు నుంచి నుదుటి వరకు పొడవుగా సింధూరం పెట్టుకోవడం ఛత్ పూజలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపుగా నిలిచింది.

(Disclaimer: సింధూర ధారణకు సంబంధించిన ఈ వివరాలు ప్రాంతీయ ఆచారాలు, మతపరమైన, జానపద విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి.)

Follow Us