తాజ్ మహల్‌లో పూజలు చేస్తాం.. : శివసేన

తాజ్ మహాల్‌కు ముప్పు పొంచి ఉంది. అయితే ప్రమాదం అనండంతో అదేదో ఉగ్రవాదులను పొంచి ఉన్న ముప్పు కాదు.. శివసేన నుంచి ఉన్న ముప్పు. ఏ క్షణాన ఏదైనా జరగవచ్చని.. దీంతో తాజ్ మహల్‌కు భద్రతను పెంచాలని ఏఎన్ఐ కోరింది. ప్రతి సోమవారం హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్న శివసేనతో.. తాజ్ మహల్‌కు హాని జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్‌కు లేఖను కూడా రాసింది. భద్రతను పెంచాలని లేఖలో ఏఎన్ఐ కోరింది. ఆగ్రాకి […]

తాజ్ మహల్‌లో పూజలు చేస్తాం.. : శివసేన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 21, 2019 | 9:29 AM

తాజ్ మహాల్‌కు ముప్పు పొంచి ఉంది. అయితే ప్రమాదం అనండంతో అదేదో ఉగ్రవాదులను పొంచి ఉన్న ముప్పు కాదు.. శివసేన నుంచి ఉన్న ముప్పు. ఏ క్షణాన ఏదైనా జరగవచ్చని.. దీంతో తాజ్ మహల్‌కు భద్రతను పెంచాలని ఏఎన్ఐ కోరింది. ప్రతి సోమవారం హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్న శివసేనతో.. తాజ్ మహల్‌కు హాని జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్‌కు లేఖను కూడా రాసింది. భద్రతను పెంచాలని లేఖలో ఏఎన్ఐ కోరింది. ఆగ్రాకి చెందిన శివసేన విభాగం తాజ్ మహల్ వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. తాజ్ మహల్ ముస్లింలకు సబంధించింది కాదని.. శివునికి సబంధించిన దేవాలయంగా స్పష్టం చేసింది. అక్కడ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటూ శివసేన తెలిపింది. దీంతో తాజ్ మహల్ వద్ద నిఘాను కట్టుదిట్టం చేయాలని ఏఎన్ఐ కోరంది.