తెలంగాణలో 33 ఏళ్ల రికార్డ్ క్రియేట్ చేసిన వానాకాలం

తెలంగాణలో ఈ వానాకాలం సరికొత్త రికార్డులు నమోదు చేసింది. 33 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనన్ని వర్షాలు ఈ సీజన్ లో నమోదయ్యాయి. వానాకాలం సీజన్‌ 4 నెలలు.. అంటే,120 రోజులుకు గాను 82 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. ఇది ఒక రికార్డ్. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 తేదీ వరకు వానాకాలం సీజన్‌గా లెక్కిస్తారు. ఈ వ్యవధిలో నైరుతి రుతుపవనాలు వర్షిస్తాయి. ఈ సీజన్‌లో జూన్‌ 11 తేదీన తెలంగాణకు […]

తెలంగాణలో 33 ఏళ్ల రికార్డ్ క్రియేట్ చేసిన వానాకాలం
Follow us

|

Updated on: Oct 01, 2020 | 8:13 AM

తెలంగాణలో ఈ వానాకాలం సరికొత్త రికార్డులు నమోదు చేసింది. 33 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనన్ని వర్షాలు ఈ సీజన్ లో నమోదయ్యాయి. వానాకాలం సీజన్‌ 4 నెలలు.. అంటే,120 రోజులుకు గాను 82 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. ఇది ఒక రికార్డ్. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 తేదీ వరకు వానాకాలం సీజన్‌గా లెక్కిస్తారు. ఈ వ్యవధిలో నైరుతి రుతుపవనాలు వర్షిస్తాయి. ఈ సీజన్‌లో జూన్‌ 11 తేదీన తెలంగాణకు రుతుపవనాలు చేరుకొని విస్తరించాయి. ఇక అప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. జూన్‌లో 11 రోజులు మినహాయిస్తే.. గడిచిన 111 రోజుల వ్యవధిలో జూన్‌లో 16 రోజులు, జులైలో 24 రోజులు, ఆగస్టులో 25 రోజులు, సెప్టెంబరులో 17 రోజులు కలిపి మొత్తం 82 వర్షపు రోజులు (రెయినీడేస్‌) నమోదుకావటాన్ని ఇటు వాతావరణశాఖ, అటు వ్యవసాయ శాఖలు ఓ సరికొత్త రికార్డుగా పేర్కొంటున్నాయి.

అదేక్రమంలో ఈ వానాకాలం సీజన్ లో దినసరి సగటు వర్షపాతం 13.2 మి.మీ నమోదుకావటమూ రికార్డే. దినసరి వర్షపాతం సగటు కూడా ఈ ఏడాదే అత్యధికంగా(13.2 మి.మీ) నమోదైంది. అంతకుముందు 3 దశాబ్ధాల వ్యవధిలో ఈ స్థాయిలో దినసరి సగటు వర్షపాతం ఎప్పుడూ నమోదుకాలేదు. ఈ 33 ఏండ్ల వ్యవధిలో అతి తక్కువగా 2002-03లో 47 వర్షపురోజులు నమోదయ్యాయి. ఈ వార్షాకాలంలో ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలు బీభత్సం సృష్టించాయి. ఆగస్టు లో 78 శాతం, సెప్టెంబర్‌లో 94 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఉత్తర తెలంగాణలో ఎక్కువ వర్షం పడితే, దక్షిణ తెలంగాణ లో పడకపోవటం, రెండు చోట్ల పడితే మధ్య తెలంగాణలో పడకపోవటం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఈ సీజన్‌లో అలా జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌, కుమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల.. ఈ ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, మిగిలిన 27 జిల్లాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.

Latest Articles