షాకింగ్.. వారిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయారు..!

Prakash Kovelamudi, Kanika Dhillon Separated, షాకింగ్.. వారిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయారు..!

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రఘవేంద్రరావు కుటుంబానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఆయన కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి, కోడలు కనిక దిల్లాన్‌లు రెండేళ్ల క్రితమే విడిపోయారన్న వార్త సంచలనం రేపుతోంది. తాజాగా ఈ విషయాన్ని రాఘవేంద్రరావు కోడలు కనిక వెల్లడించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’కు వీరిద్దరూ కలసి పని చేశారు. ఈ సినిమాకు ప్రకాశ్ దర్శకత్వం వహించగా, కనిక రచయిత్రిగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి కనిక వెల్లడించారు. తామిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయామని తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని చెప్పారు. ప్రకాశ్, కనికలు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *