చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి

| Edited By:

Jul 29, 2019 | 11:27 AM

గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య ఈ పోరు మరింత ఎక్కువగా ఉంది. టీడీపీని టార్గెట్ చేస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్స్ చేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన దళారి సతీష్‌తో పాటు చంద్రబాబు, ఆయన పార్టీ ప్రముఖుల సంబంధాలపైన కేంద్రం దర్యాప్తునకు ఆదేశించాలంటూ ట్వీట్ చేశారు. ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే […]

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి
Follow us on

గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య ఈ పోరు మరింత ఎక్కువగా ఉంది. టీడీపీని టార్గెట్ చేస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్స్ చేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన దళారి సతీష్‌తో పాటు చంద్రబాబు, ఆయన పార్టీ ప్రముఖుల సంబంధాలపైన కేంద్రం దర్యాప్తునకు ఆదేశించాలంటూ ట్వీట్ చేశారు. ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.