మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకెళతారని బీజేపీ నేత కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో.. బీజేపీ సభ్వత్వ నమోదు కార్యక్రమం సంఘటన్ పర్వ్‌కు కృష్ణంరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో కేంద్రం తనను జైలులో పెడుతుందేమోనని చంద్రబాబు వ్యాఖ్యానించారని.. సానుభూతి ఓట్ల కోసం అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలే త్వరలో నిజమవుతాయని అన్నారు.
ఇక ముఖ్యమంత్రి జగన్‌కు తెలంగాణపై అతి ప్రేమ మంచిది కాదని అన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా బీజేపీలోకి చేరేందుకు చాలామంది వస్తున్నారని.. ఆ వలసలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి బీజేపీ న్యాయం చేస్తుందని.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని కృష్ణంరాజు తెలిపారు.