బెట్టింగ్లు వేసినంత ఈజీ కాదు.. పోలవరం నిర్మాణం : చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు కట్టడం అంటే… కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్లు నిర్వహించినంత సులభం అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కాఫర్ డ్యాం కట్టటం వల్లే ఈ రోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెప్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి విషయంలోనూ టెక్నికల్ కమిటీలు ఉంటాయని…కేంద్ర పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుందని గుర్తు చేశారు. ఇంజనీర్లు, అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి, కష్టపడి డిజైన్లను అందిస్తారని, […]
పోలవరం ప్రాజెక్టు కట్టడం అంటే… కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్లు నిర్వహించినంత సులభం అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కాఫర్ డ్యాం కట్టటం వల్లే ఈ రోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెప్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి విషయంలోనూ టెక్నికల్ కమిటీలు ఉంటాయని…కేంద్ర పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుందని గుర్తు చేశారు. ఇంజనీర్లు, అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి, కష్టపడి డిజైన్లను అందిస్తారని, ఈ విషయాలను సదరు మేధావులు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
గోదావరి వరద వస్తుందని, ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని రెండు నెలల ముందే పోలీస్, రెవిన్యూ యంత్రాంగాలను అధికారులు అప్రమత్తం చేశారు. మరి ఈ మేధావులు ఇన్నాళ్ళూ ఏం చేశారు? మీకు చేతకాని ప్రతి పనికీ నన్ను చూపించడం మాని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చెయ్యాలో నేర్చుకోండి.
— N Chandrababu Naidu (@ncbn) August 12, 2019