ఏపీ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోండి: ప్రధానికి బాబు లేఖ

| Edited By:

Aug 17, 2020 | 10:06 AM

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాశారు.

ఏపీ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోండి: ప్రధానికి బాబు లేఖ
Follow us on

Chandrababu letter to Modi: ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్‌ వలన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీని వలన ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని ఆయన బాబు లేఖలో ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేయడం ప్రజాస్వామ్యం నాశనమవుతుందని బాబు పేర్కొన్నారు.

ఏపీలోని రాజకీయ నాయకులు, ఇతరుల ఫోన్‌ల ట్యాపింగ్‌తో తీవ్ర ముప్పు ఉందని.. దేశ భద్రతకే ఇది పెను ప్రమాదంగా పరిణమించే ప్రమాదం ఉందని బాబు వెల్లడించారు. వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారని.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు పెరిగాయని అన్నారు. మొదట్లో గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై, విధానాలపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పిందని, ఏపీ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాబు, ప్రధానిని కోరారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను మోదీకి పంపారు బాబు.

Read More:

పెరుగుతున్న కరోనా కేసులు.. షార్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. సిలబస్ తగ్గింపు