AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూపాయి ఖర్చు లేకుండా.. చచ్చిపోయే మొక్కలను బ్రతికించే లిక్విడ్ ఫెర్టిలైజర్

మన ఇంటి పెరట్లో లేదా టెర్రస్ గార్డెన్‌లో ఎంతో ప్రేమగా పెంచుకునే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు ఒక్కోసారి వాడిపోతూ ఉంటాయి. ఎంత నీళ్లు పోసినా మొక్కల్లో ఎదుగుదల లేకపోవడం, పూత రాలిపోవడం వంటి సమస్యలు తోటపని చేసే ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడతాయి. ఇలాంటి సమయంలో ఖరీదైన రసాయన ఎరువుల వైపు వెళ్లకుండా, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే మొక్కలకు 'లిక్విడ్ గోల్డ్' లాంటి అద్భుతమైన పోషక ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చచ్చిపోయే దశలో ఉన్న మొక్కలను కూడా మళ్లీ చిగురింపజేసే అమృతంలా పనిచేస్తుంది.

Phani CH
|

Updated on: Nov 14, 2026 | 9:14 PM

Share
ఈ శక్తివంతమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారీకి మనకు కేవలం రెండే రెండు వస్తువులు కావాలి. మొదటిది కలబంద (అలోవెరా), రెండోది పాత ఆవు పిడకలు. కలబందలో సుమారు 75 కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులోని విటమిన్ ఏ, సి, ఇ, బి లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, అమైనో యాసిడ్స్ మొక్కల రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

1 / 5
అంతేకాకుండా ఇది మట్టిలో తేమ శాతాన్ని ఎక్కువసేపు నిలిపి ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక పాత ఆవు పిడకలలో మొక్కలకు కావాల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం (ఎన్‌పికే) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మట్టిని గుల్లగా మార్చి వేళ్లకు గాలి బాగా అందేలా చేస్తాయి.

2 / 5
దీనిని తయారు చేసుకునే విధానం చాలా సులభం. ముందుగా మూడు కలబంద ఆకులను కట్ చేసి, అందులోని పసుపు రంగు ద్రవం పోయేవరకు కాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత కలబంద ఆకులను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బకెట్ లేదా గిన్నెలో మూడు లీటర్ల నీళ్లు తీసుకుని, అందులో తరిగిన కలబంద ముక్కలు, వాటికి సమాన పరిమాణంలో పాత ఆవు పిడకల ముక్కలను వేయాలి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి మూడు రోజుల పాటు నానబెట్టాలి. అయితే, ప్రతిరోజూ ఒకసారి మూత తీసి కర్రతో బాగా కలుపుతూ ఉండాలి.

3 / 5
మూడు రోజుల తర్వాత ఈ ద్రావణం చిక్కటి తేనె రంగులోకి మారుతుంది. అప్పుడు చేత్తో ఆ పిడకలను బాగా నలిపి, ఆ నీటిని వడపోసుకోవాలి. మిగిలిన పిప్పిని ఎండబెట్టి మళ్లీ మొక్కల మొదట్లో ఎరువుగా వేసుకోవచ్చు. ఈ వడపోసిన ద్రావణం చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి, నేరుగా మొక్కలకు పోయకూడదు. ఒక లీటరు ఫెర్టిలైజర్‌కు పది లీటర్ల సాధారణ నీటిని (1:10 నిష్పత్తిలో) కలిపి బాగా డైల్యూట్ చేయాలి.

4 / 5
ఈ పోషక ద్రావణాన్ని 15 రోజులకు ఒకసారి అన్ని రకాల పండ్లు, పూలు, కూరగాయల మొక్కల మొదట్లో పోయవచ్చు లేదా మొక్కలపై పిచికారీ చేయవచ్చు. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండే సమయంలో ఇది మొక్కలకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ సహజ సిద్ధమైన ఎరువును వాడితే మీ తోటలోని మొక్కలు నిత్యం పచ్చగా, ఆరోగ్యంగా కళకళలాడుతూ మంచి దిగుబడిని ఇస్తాయి.

5 / 5
Follow Us