వీసా లేకుండానే విదేశాలను చూట్టెయ్యొచ్చు.. భారతీయులకు వెల్‏కమ్ చెబుతున్న కంట్రీస్ ఇవే..

|

Sep 09, 2021 | 1:37 PM

సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే.. తప్పనిసరిగా వీసా ఉండాల్సిందే. ఇక వీసా రావడం అంటే మాములు విషయం కాదు ఎన్నో అవాంతరాలను దాటుకుని వీసా అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అయితే వీసా లేకుండానే భారతీయులకు స్వాగతం పలికే దేశాలు కూడా ఉన్నాయి.

1 / 5
 భారతీయులు వీసా లేకుండా.. లేదా.. ఈటీఏ (ఇ. ట్రావెల్ అథారిటీ) సౌకర్యం లేకుండా ప్రపంచంలోని 53 దేశాలకు వెళ్లవచ్చు. గతేడాది కేంద్ర సహాయ మంత్రి వి. మురళీధరన్.. రాజ్యసభలో 43 దేశాలకు భారతీయులు వీసా ఆన్ అరైవల్ సదుపాయంతో వెళ్లవచ్చని చెప్పారు

2 / 5
ఇందులో నేపాల్, భూటాన్ సహా 16 దేశాలకు వీసా అవసరం లేదు. నేపాల్ వెళ్లాలంటే.. గుర్తింపు కార్డు ఆధారంగా మాత్రమే వెళ్లోచ్చు.  ఇరాన్-మయన్మార్‌తో సహా 34 దేశాలలో ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక్కడ ఇ.. వీసా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈటీఏ అనేది వీసా కాదు.. కేవలం ప్రయాణానికి ముందు అథారిటీ ఆమోదం మాత్రమే.

3 / 5
 145 దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాక్, సింగపూర్ మరియు అమెరికా సహా అనేక దేశాలు ఉన్నాయి. ఇక్కడకు వెళ్లాలంటే కచ్చితంగా వీసా ఉండాల్సిందే. అలాగే 145 దేశాలలో ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, మలేషియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, వియత్నాం వంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం  కరోనా కారణంగా అనుమతి లేదు.

4 / 5
అలాగే భారతీయులు వీసా అవసరం లేకుండా.. బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంకాంగ్, మాల్దీవులు, మారిషస్, మోంట్‌సెరాట్, నేపాల్, నియు ద్వీపం, సమోవా, సెనెగల్, ట్రినిడాడ్ మరియు టొబాగో, ట్యునీషియా, వాలువాటు, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ మరియు సెర్బియా దేశాలకు వెళ్లొచ్చు. వీటిలో కొన్ని దేశాలలో ప్రయాణ కాలం 30 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉంటుంది.

5 / 5
 ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాక్, సింగపూర్ మరియు అమెరికాతో సహా అనేక దేశాలకు వెళ్లడానికి కచ్చితంగా వీసా ఉండాల్సిందే. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా నియమనిబంధనలలో మార్పులు జరిగాయి.