2 / 5
పెళ్లి ఎలా చేసుకున్నా.. నేటి కాలంలో వివాహానంతంర రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని చట్టాలు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది గృహ హింస. 2005 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. భర్త లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా లేదా ఆర్థికంగా వేధిస్తే మీరు చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. పెళ్లి తర్వాత ఆడపిల్లల భద్రత, సంక్షేమం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. భారతీయ చట్టం ప్రకారం మానవులందరికీ సమాన సమానత్వం, గౌరవంతో జీవించే హక్కు ఉంది. ఈ ప్రాథమిక హక్కులు వివాహితులందరికీ సమానంగా వర్తిస్తాయి. ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను రక్షించడం.