Tech Tips: వార్నీ ఇంత కథుందా?.. 3-పిన్ ప్లగ్‌లో ఒక పిన్ ఎందుకు లావుగా, పొడవుగా ఉంటుందో తెలుసా?

Updated on: Jul 11, 2026 | 6:36 PM

సాధారణంగా మన ఇళ్లలో ఉపయోగించే విద్యుత్ పరికరాలకు రెండు రకాల ప్లగ్స్ ఉంటాయి. కొన్నింటికి రెండు పిన్స్ ఉంటే.. మరికొన్నింటికి మూడు పిన్స్ ఉంటాయి. అయితే మీరు 3 పిన్స్ ప్లగ్స్‌ను సరిగ్గా గమనిస్తే.. వాటిలో రెండు పిన్స్ చిన్నగా, ఒకటి పెద్దగా ఉంటుంది. అలా ఎందదుకు ఉంటాయోననైఇ మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది కేవలం డిజైన్ కోసం మాత్రమే కాదు, దీని వెనుక ఒక ముఖ్యమైన శాస్త్రీయ, భద్రతా కారణం ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
3-పిన్ ప్లగ్ వేటికి వాడుతారు: సాధారణంగా మన ఇంట్లో వాడే ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్, గీజర్ వంటి భారీ విద్యుత్ పరికరాల ఈ 3పిన్ ప్లగ్స్‌ను వాడుతారు. ఎందుకంటే వీటికి వెలుపలి భాగం లోహంతో తయారవుతుంది. కాబట్టి షార్ట్‌ సర్క్యూట్‌ జరినప్పుడూ లేదా వైర్లు అరిగిపోయినప్పుడు అవి లోహపు బాడీకి తగిలికే కరెంటు సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో సరైన ఎర్తింగ్ లేకపోతే, వీటిని ముట్టుకుంటే మనకు కూడా కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటికి 3-పిన్ ప్లగ్ వాడుతారు.

2 / 5
2-పిన్ ప్లగ్స్ దేనికి?: అయితే మన ఇంట్లో ఉండే మొబైల్ ఛార్జర్లు, టీవీలు లేదా ట్రిమ్మర్ల వంటి తక్కువ విద్యుత్ వినియోగించే పరికరాలకు ప్లాస్టిక్ బాడీ ఉంటుంది.. కాబట్టి వాటికి 2-పిన్ ప్లగ్‌ వాడుతారు. ఎందుకంటే వీటిలో తక్కువ విద్యుత్‌ సరఫరా కారణంగా పెద్దగా ప్రభావం ఉండదు.

3 / 5
ఆ ఒక్క పిన్ ఎందుకు పొడవుగా ఉంటుంది: ఇక 3 పిన్‌ ప్లగ్‌కు ఒక్క పిన్ ఎందుకు పొడవుగా ఉందనే విషయానికి వస్తే.. మీరు ప్లగ్‌ని సాకెట్‌లో పెట్టినప్పుడు, అన్నిటికంటే పొడవుగా ఉన్న ఎర్త్‌ పిన్ మొదట లోపలికి వెళ్తుంది.ఫేజ్, న్యూట్రల్ పిన్‌ల కంటే ముందే ఎర్త్ పిన్ సాకెట్‌తో కనెక్ట్ అవుతుంది. దీనివల్ల ఒకవేళ ఆ పరికరంలో ముందే విద్యుత్ లీకేజీ ఉన్నా, కరెంట్ పరికరంలోకి ప్రవహించక ముందే ఆ లీకేజీ విద్యుత్ సురక్షితంగా ఎర్తింగ్ వెళ్ళిపోతుంది. దీనివల్ల మీరు ఆ పరికరాన్ని తాకినప్పుడు విద్యుత్ మీ శరీరం ద్వారా కాకుండా, ఎర్త్ పిన్ ద్వారా వెళ్లడం వల్ల మీకు షాక్ కొట్టే ప్రమాదం తప్పుతుంది.

4 / 5
ఆ పిన్ ఎందుకు లావుగా ఉంటుంది?: అయితే ఇందుకు రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. అయితే ఎర్త్ పిన్ లావుగా ఉండటం వల్ల, దానిని లైవ్ లేదా న్యూట్రల్ స్లాట్లలో పెట్టలేము. ఒకవేళ అది సన్నగా ఉంటే మనం తప్పుగా పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన పరికరం పాడైపోయే అవకాశం ఉంది.

5 / 5
సైన్స్ నియమాల ప్రకారం, వైర్ లేదా పిన్ ఎంత లావుగా ఉంటే దాని విద్యుత్ నిరోధకత అంత తక్కువగా ఉంటుంది. నిరోధకత తక్కువగా ఉంటే విద్యుత్ చాలా వేగంగా, సులభంగా ప్రవహిస్తుంది. దీనివల్ల లీక్ అయిన కరెంట్ ఏమాత్రం ఆలస్యం కాకుండా, ఎక్కువ వేడిని పుట్టించకుండా వెంటనే భూమిలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా 3-పిన్ ప్లగ్‌లోని పెద్ద పిన్ మన ఇళ్లలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఒక అద్భుతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది.

Follow Us