కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

Updated on: May 29, 2026 | 3:09 PM

భానుడి భగభగలకు ప్రతి ఇంట్లో ఏసీ లేదా కూలర్ కంపల్సరీగా మారింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ కొనలేని వారికి లేదా ఏసీ బిల్లు భారీగా వస్తుందని భయపడేవారికి ఎయిర్ కూలర్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అయితే కూలర్ ఆన్ చేయగానే గది కూల్ అవ్వాల్సింది పోయి.. ఒక్కోసారి విపరీతమైన చెమటలు, ఉక్కపోత మొదలవుతాయి. అసలు కూలర్ వాడుతున్నప్పుడు ఈ హ్యుమిడిటీ సమస్య ఎందుకు వస్తుంది? కూలర్ వాడేటప్పుడు చాలామంది చేసే కామన్ తప్పులు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

1 / 6
ఎయిర్ కూలర్లు ఇవాపరేటివ్ కూలింగ్ అనే టెక్నాలజీతో పనిచేస్తాయి. కూలర్లకు ఉండే ప్యాడ్స్‌పై నీళ్లు పడినప్పుడు, బయటి నుండి వచ్చే వేడి గాలి ఆ నీటిని ఆవిరి చేసుకుని గదిలోకి చల్లగా వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల గాలి చల్లబడుతుంది కానీ అదే సమయంలో గదిలో తేమ విపరీతంగా పెరిగిపోతుంది.
మనం ఏసీ లాగా గది తలుపులు, కిటికీలు అన్నీ పూర్తిగా మూసేసి కూలర్ ఆన్ చేస్తాం. దీనివల్ల ఆవిరైన తేమ అంతా గదిలోనే ఉండిపోతుంది. గాలిలో తేమ ఎక్కువైతే మన ఒంటికి పట్టే చెమట అస్సలు ఆరదు. ఫలితంగా గాలి చల్లగా ఉన్నా కూడా ఒళ్లంతా అంటుకుపోతూ విపరీతమైన ఉక్కపోతగా అనిపిస్తుంది.

ఎయిర్ కూలర్లు ఇవాపరేటివ్ కూలింగ్ అనే టెక్నాలజీతో పనిచేస్తాయి. కూలర్లకు ఉండే ప్యాడ్స్‌పై నీళ్లు పడినప్పుడు, బయటి నుండి వచ్చే వేడి గాలి ఆ నీటిని ఆవిరి చేసుకుని గదిలోకి చల్లగా వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల గాలి చల్లబడుతుంది కానీ అదే సమయంలో గదిలో తేమ విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఏసీ లాగా గది తలుపులు, కిటికీలు అన్నీ పూర్తిగా మూసేసి కూలర్ ఆన్ చేస్తాం. దీనివల్ల ఆవిరైన తేమ అంతా గదిలోనే ఉండిపోతుంది. గాలిలో తేమ ఎక్కువైతే మన ఒంటికి పట్టే చెమట అస్సలు ఆరదు. ఫలితంగా గాలి చల్లగా ఉన్నా కూడా ఒళ్లంతా అంటుకుపోతూ విపరీతమైన ఉక్కపోతగా అనిపిస్తుంది.

2 / 6
కూలర్ సమర్థవంతంగా పనిచేయాలంటే గదిలోకి ఎంత గాలి వస్తుందో, అంత గాలి బయటకు వెళ్లిపోవాలి. కూలర్ వెనుక భాగం సరిగ్గా కిటికీ లేదా తలుపునకు ఎదురుగా ఉండాలి. తద్వారా అది బయటి నుండి పొడి, తాజా గాలిని లోపలికి లాక్కోగలదు. కూలర్ విసిరే తేమతో కూడిన గాలి బయటకు వెళ్లిపోవడానికి దానికి ఎదురుగా ఉండే మరో కిటికీ లేదా తలుపును కనీసం 30శాతం తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గదిలో గాలి ఎప్పటికప్పుడు మారుతూ ఉక్కపోత లేకుండా రూమ్ పొడిగా, చల్లగా ఉంటుంది.

3 / 6
గది త్వరగా చల్లబడాలని చాలామంది కూలర్ పైన ఉండే ఐస్ బాక్స్‌లో ఐస్ ముక్కలు వేస్తుంటారు. ఇది మంచి పద్ధతే కానీ ఇందులో ఒక లాజిక్ ఉంది.
ఐస్ వేయడం వల్ల నీరు త్వరగా కూల్ అయి, గాలి మరింత చల్లగా వస్తుంది. ట్యాంక్ నిండా కేవలం ఐస్ ముక్కలు లేదా విపరీతమైన ఐస్ వాటర్ పోయకూడదు. నీరు మరీ ఎక్కువ చల్లగా ఉంటే.. అది ఆవిరి అయ్యే ప్రక్రియ మందగిస్తుంది. దీనివల్ల కూలింగ్ పెరగడానికి బదులు తగ్గిపోతుంది. కాబట్టి తగినంత ఐస్ మాత్రమే వాడండి.

గది త్వరగా చల్లబడాలని చాలామంది కూలర్ పైన ఉండే ఐస్ బాక్స్‌లో ఐస్ ముక్కలు వేస్తుంటారు. ఇది మంచి పద్ధతే కానీ ఇందులో ఒక లాజిక్ ఉంది. ఐస్ వేయడం వల్ల నీరు త్వరగా కూల్ అయి, గాలి మరింత చల్లగా వస్తుంది. ట్యాంక్ నిండా కేవలం ఐస్ ముక్కలు లేదా విపరీతమైన ఐస్ వాటర్ పోయకూడదు. నీరు మరీ ఎక్కువ చల్లగా ఉంటే.. అది ఆవిరి అయ్యే ప్రక్రియ మందగిస్తుంది. దీనివల్ల కూలింగ్ పెరగడానికి బదులు తగ్గిపోతుంది. కాబట్టి తగినంత ఐస్ మాత్రమే వాడండి.

4 / 6
కూలర్ వెనక ఉండే హనీకోంబ్ లేదా గడ్డి ప్యాడ్స్ కూలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్యాడ్స్‌పై దుమ్ము, ఉప్పు పేరుకుపోతే నీటి సరఫరా సరిగ్గా జరగదు. గాలి లోపలికి రాలేదు. దీనివల్ల కూలింగ్ తగ్గి ఉక్కపోత పెరుగుతుంది. కాబట్టి కనీసం వారానికి ఒకసారి కూలర్ ట్యాంక్ క్లీన్ చేసి, ప్యాడ్స్‌ను వాటర్ పైప్‌తో శుభ్రం చేయాలి. ప్యాడ్స్ పూర్తిగా అరిగిపోతే మార్చడం చాలా అవసరం.

5 / 6
కూలర్‌ను గది లోపల ఒక మూలన పెడితే అది లోపలి గాలినే మళ్లీ మళ్లీ సర్క్యులేట్ చేస్తుంది. దీనివల్ల హ్యుమిడిటీ విపరీతంగా పెరిగిపోతుంది. కూలర్ ఎప్పుడూ తాజా గాలి వచ్చే చోటే ఉండాలి. రోజులు తరబడి ట్యాంక్‌లోని పాత నీటిని అలాగే ఉంచడం వల్ల దుర్వాసన రావడమే కాకుండా దోమలు చేరి అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజువారీగా లేదా రెండు రోజులకొకసారి నీటిని మార్చడం మంచిది.

6 / 6
చిన్న గదికి పెద్ద కూలర్ లేదా పెద్ద హాల్‌కి చిన్న కూలర్ పెడితే ఆశించిన ఫలితం ఉండదు. రూమ్ సైజ్ ఆధారంగా రేటింగ్‌ను చూసి కూలర్‌ను ఎంచుకోవాలి. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూలర్ పెట్టిన గదిలో సీలింగ్ ఫ్యాన్‌ను చాలా తక్కువ స్పీడ్‌లో రన్ చేయండి. ఇది కూలర్ ఇచ్చే చల్లటి గాలిని గది నలుమూలలా సమానంగా విస్తరించేలా చేస్తుంది. అలాగే మధ్యాహ్నం పూట గది కిటికీలకు మందపాటి కర్టెన్లు వేయడం ద్వారా బయటి వేడి లోపలికి రాకుండా చూడొచ్చు.

Follow Us