Aeolus Satellite: మొదటి సారిగా భూమిపై పడనున్న ఉపగ్రహం.. చరిత్ర సృష్టించనున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ

|

Jul 27, 2023 | 5:59 PM

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)కి చెందిన ఉపగ్రహం భూమిపై పడనుంది. పనికిరాని ఉపగ్రహం ఏయోలస్‌ను తిరిగి భూమికి పంపేటప్పుడు ఏజెన్సీ చేసిన మొదటి మిషన్ ఇదే. ఈ మిషన్ భూమికి..

1 / 5
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)కి చెందిన ఉపగ్రహం భూమిపై పడనుంది. పనికిరాని ఉపగ్రహం ఏయోలస్‌ను తిరిగి భూమికి పంపేటప్పుడు ఏజెన్సీ చేసిన మొదటి మిషన్ ఇదే. ఈ మిషన్ భూమికి ఉపగ్రహాలు తిరిగి రావడానికి మార్గాన్ని తెరుస్తుంది. ఇప్పుడు ESA ఉపగ్రహం 320 కి.మీ దూరం నుంచి భూమిపై పడనుంది. జూన్ 19న తన మిషన్ పూర్తి చేసుకున్న ఈ ఉపగ్రహం భూమి వైపు రానుంది.

2 / 5
జూలై 28న భూమిపైకి రానుంది. జూలై 24న 280 కి.మీ.కు చేరుకోగానే ఈఎస్‌ఏ మిషన్ ఆపరేటర్లు సురక్షితంగా భూమికి చేరుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. నివేదిక ప్రకారం.. జూలై 28న ఉపగ్రహం భూమిని చేరుకుంటుంది. ఈ సమయంలో ఆపరేటర్ దానిని మార్గనిర్దేశం చేస్తాడు.

3 / 5
భూమిపై ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా ఉపగ్రహాలు ముక్కలుగా విభజించబడతాయి. అన్నీ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగితే ఎలాంటి ప్రమాదం ఉండదని ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అట్లాంటిక్ మహాసముద్రంలో పడవేయనుంది.

4 / 5
సాధారణంగా పడే ఉపగ్రహంతో పోలిస్తే ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల అనేక రకాల ప్రమాదాలు తగ్గుతాయని ఏజెన్సీ పేర్కొంది. ఈ విధంగా ప్రమాదాలు 42 రెట్లు తగ్గుతాయి. 1360 కిలోల బరువున్న భారత ఉపగ్రహం ఏయోలస్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2018లో ప్రయోగించింది. భూమి, ఇతర గ్రహాల చుట్టూ గాలి వేగాన్ని కొలవడం దీని లక్ష్యం. వాతావరణ సమాచారాన్ని అందించే ముఖ్యమైన గ్రహాలలో ఇది ఒకటి.

5 / 5
ఏయోలస్ ఉపగ్రహం అంటే ఏమిటి? గ్రీకు పురాణాలలో గాలుల రక్షకుడిని ఏయోలస్ అని పిలుస్తారు. ఈ ఉపగ్రహం గాలి వేగాన్ని కొలిచే పని కాబట్టి, దీనికి ఏయోలస్ అని పేరు పెట్టారు. వాతావరణాన్ని అంచనా వేయడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది 3 సంవత్సరాల కోసం పంపించారు. ఇప్పుడు ఇది 5 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇంధనం కూడా అయపోతుంది.