Air Conditioners: ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా..? ఈ సంకేతాలు గమనిస్తే వెంటనే బంద్ చేయండి..

Updated on: Mar 25, 2026 | 7:34 PM

ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఏసీ ఒక సాధారణ వస్తువుగా మారిపోయింది. చల్లదనం కోసం చాలామంది ఏసీలను అమర్చుకుంటున్నారు. అయితే, ఏసీలను కొనుగోలు చేస్తున్నవారు వాటిని సక్రమంగా మెయింటైన్ చేయడం ముఖ్యమైన విషయం.. అయితే.. ఏసీలు ఎందుకు పేలతాయో ఈ కథనంలో తెలుసుకుందాం..

1 / 5
ఏసీల వల్ల ఉపయోగం ఎంత ఉందో, నిర్లక్ష్యం వహిస్తే అంతే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో చల్లదనం కోసం ప్రజలు ఏసీలను అధికంగా ఉపయోగిస్తున్నారు. అయితే వాటి నిర్వహణలో అజాగ్రత్త, లోపాలను గుర్తించడంలో విఫలమవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే.. ఎయిర్ కండిషనర్ల వాడకం, నిర్వహణ విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఏసీ ఒక సాధారణ వస్తువుగా మారిపోయింది. చల్లదనం కోసం చాలామంది ఏసీలను అమర్చుకుంటున్నారు. అయితే, ఏసీలను కొనుగోలు చేస్తున్నవారు వాటిని సక్రమంగా మెయింటైన్ చేయడం ముఖ్యమైన విషయం.. అంతేకాకుండా.. వాటిలో లోపాలను గుర్తించడంలో విఫలమైతే.. తమతో పాటు పక్క వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

3 / 5
అయితే.. ఏసీ (Air Conditioner) కంప్రెషర్ పేలడానికి అనేక కారణాలున్నాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద నిరంతరం పనిచేయడం, కూలింగ్ ఫ్యాన్ పనిచేయకపోవడం వల్ల ఓవర్‌హీట్ అవ్వడం, రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీకేజీ, వోల్టేజ్ హెచ్చుతగ్గులు వంటివి ప్రధాన కారణాలని పేర్కొంటున్నారు.

4 / 5
పాత లేదా దెబ్బతిన్న పైపుల ద్వారా గ్యాస్ లీక్ అయితే అది మంటలకు కారణమై పేలుడుకు దారితీయవచ్చు. ప్రతి ఆరు నెలలకు లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి ఏసీకి సర్వీసింగ్ చేయించడం అత్యవసరం. గ్యాస్ లీకేజీలు, వైరింగ్, ఫిల్టర్లు, ఇతర భాగాలను తనిఖీ చేయించుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.

5 / 5
మీ ఏసీ చుట్టూ సరైన గాలి ప్రవాహం ఉండేలా చూసుకోవాలి. వింత వాసనలు వస్తే వెంటనే టెక్నీషియన్‌కు తెలియజేయాలి. నాణ్యమైన ఏసీలను కొనుగోలు చేయడం కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.. అయితే.. ఏమైనా సమస్యలను లేదా లోపాలను గుర్తిస్తే.. వెంటనే అప్రమత్తమవ్వండి..

Follow Us