ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవే.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు..

Updated on: Apr 24, 2026 | 3:02 PM

నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనంగానే కాకుండా ఒక మినీ సెక్రటేరియట్‌గా మారిపోయింది. ఒకప్పుడు చిన్న ప్రభుత్వ ధృవీకరణ పత్రం కావాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగడం, మధ్యవర్తులను ఆశ్రయించడం సామాన్యులకు తప్పనిసరి అయ్యేది. కానీ డిజిటల్ ఇండియా కార్యక్రమం దీనిని పూర్తిగా మార్చేసింది. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, వేగంగా, నేరుగా ప్రజలకు చేరవేయడంలో ఐదు మొబైల్ యాప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

1 / 5
ఎం-ఆధార్ : మన దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం ఆధార్. ఎం-ఆధార్ యాప్ ద్వారా మీ మొబైల్‌నే ఒక వర్చువల్ ఐడి కార్డ్‌గా మార్చుకోవచ్చు. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో భౌతిక కార్డు లేకపోయినా దీనిని చూపించవచ్చు. మీ బయోమెట్రిక్ సమాచారాన్ని ఎవరూ తప్పుడు పద్ధతిలో వాడకుండా యాప్ నుండే లాక్,అన్‌లాక్ చేసే సదుపాయం ఇందులో ఉంది.

2 / 5
డిజిలాకర్: పత్రాలు భద్రం - ప్రయాణం సుఖమయం అనే నినాదానికి డిజిలాకర్ నిదర్శనం. ఇది క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్. ఇందులో మీ టెన్త్ క్లాస్ మెమో నుండి ఇన్సూరెన్స్ కాపీల వరకు అన్నింటినీ భద్రపరుచుకోవచ్చు. ఐటి చట్టం ప్రకారం ఇందులో ఉన్న పత్రాలు ఒరిజినల్ పత్రాలతో సమానం. దీనివల్ల పత్రాలు చిరిగిపోతాయనో, పోతాయనో భయం ఉండదు.

3 / 5
ఉమాంగ్ : యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలను ఒకే చోట అందించే బృహత్తర వేదిక. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. కిసాన్ సువిధ వంటి సేవల ద్వారా సాగు సమాచారాన్ని పొందవచ్చు. స్థానిక భాషలలో లభ్యం కావడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో చేరువయ్యింది.

4 / 5
ఎం-పరివాహన్ : రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ యాప్ వాహనదారులకు తప్పనిసరి. మీ వాహనం ఆర్‌సి , ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ, ఫిట్‌నెస్ వివరాలను తనిఖీ చేయవచ్చు. పొరపాటున ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఆన్‌లైన్ ద్వారానే చలాన్లు చెల్లించే సౌకర్యం కూడా ఉంది.

5 / 5
భీమ్: నగదు రహిత లావాదేవీలలో భారత్ నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం భీమ్ . కేవలం మొబైల్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది, బ్యాంక్ అకౌంట్ వివరాలు టైప్ చేయాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ సరిగ్గా లేని చోట కూడా పని చేసేలా దీనిని రూపొందించడం విశేషం. కాగా ఈ యాప్స్ వల్ల కార్యాలయాలకు వెళ్లే పని తగ్గి సమయం ఆదా అవుతుంది. మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు అందడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.

Follow Us