AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే డబ్బుకు లోటే ఉండదు.. పొదుపు కోసం చాణక్యుడు చెప్పిన సూత్రాలివే !

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు. ఆయన ప్రతి ఒక్కరూ మంచి స్థాయిలో ఉండాలనుకుంటాడు. అందుకే మానవ వాళి కోసం అనేక విధానాలు రూపొందించాడు. అవి నేటి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా చాణక్యుడి విధానాలు అవలంభిస్తే జీవితంలో చాలా సులభంగా ఉన్నత స్థానానికి వెళ్లవచ్చు.

Samatha J
|

Updated on: Jun 04, 2025 | 5:59 PM

Share
అయితే ఆ చార్య చాణక్యుడు చాలా విషయాల గురించి తన నీతి శాస్త్రం ద్వారా తెలియ జేసిన విషయం తెలిసిందే. అలాగే మానవులు తమ జీవితంలో  ఉన్నత స్థాయికి వెళ్లి గౌరవ మర్యాదలు పొందాలంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా మెదలాలి అని పేర్కొన్నారు. ముఖ్యంగా డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది. అందుకే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

1 / 5
ఇక కొంత మంది ఎంత సంపాదించినా సరే డబ్బు నిలవడం లేదు అంటూ చాలా బాధపడి పోతుంటారు. అయితే అలాంటి వారికి ఆచార్య చాణక్యుడు పొదుపుకు సంబంధించి కొన్ని అద్భుతమైన సూత్రాలను తెలియజేశాడు. వాటిని పాటించిన వారు ఆర్థిక సమస్యలు లేకుండా ఉండటమే కాకుండా సమాజంలో కూడా ఉన్నతంగా బతుకుతారంట. ఇంతకీ ఆయన చెప్పిన పొదుపు సూత్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఎప్పుడూ కానీ ఒక వ్యక్తి ఖర్చులు అనేవి వారి ఆదాయానికి మించి ఉండకూడదంట. ఆదాయానికి మించి ఖర్చులు ఉన్న వ్యక్తి ఎప్పుడూ తన జీవితంలో సంతోషంగా ఉండలేరు, అందుకే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. అంతే కాకుండా ఖర్చు విషయంలో చాలా అచీ తూచి అడుగు వేయాలంట.

3 / 5
ఇక కొంత మంది గొప్పలకు పోయి డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ షో ఆఫ్ సంపద అనేది సంపద విలువను నాశనం చేస్తుంది. అందుకే ఇతరుల ముందు గొప్పగా బతకడానికి ఎప్పుడూ డబ్బు ఖర్చు పెట్టకండి. డబ్బు అనేది ఎప్పటికీ అవసరమైనదే, దానిని అనవసరంగా ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు అని చెప్తాడు ఆచార్య చాణ్యుడు.

4 / 5
కొంత మంది చాలా డబ్బు సంపాదిస్తారు కానీ ఆ మనీని ఎలా పొదుపు చేయాలి అనే విషయంపై అవగాహన ఉండదు. ఇది కూడా ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది అంటున్నాడు చాణక్యుడు. అందుకే సంపాదిస్తే సరిపోదు, దాన్ని పొదుపు చేయడం కూడా ముఖ్యం , దీని పై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నాడు.

5 / 5