
వాట్సప్ ఉపయోగించేవారి కోసం మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీరు మీ ఫోన్ నెంబర్ కనిపించకుండానే కేవలం యూజర్ నేమ్ కనిపించేలా ప్రొఫైల్‌ను సెట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్‌కు బదులుగా యూజర్ నేమ్ మాత్రమే కనిపించేలా సెటప్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ను వాట్సప్ పరీక్షిస్తోంది. త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకురానుంది.

మీరు ముందుగానే ఈ ఫీచర్‌ను చూడాలనుకుంటే వాట్సప్ బీటా వెర్షన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్ యూజర్ల భద్రతను మరింత మెరుగుపర్చేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. యూజర్లు యూజర్ నేమ్ సెట్ చేసుకోవడం వల్ల ఫోన్ నెంబర్‌ను దాచిపెట్టవచ్చు. ఈ యూజర్ నేమ్‌తోనే మిమ్మల్ని ఇతరులు గుర్తింవచ్చు.

టెలిగ్రామ్‌లో ఇప్పటికే ఇలాంటి తరహా ఫీచర్ అందుబాటులో ఉంది. అదే తరహాలో ఇప్పుడు వాట్సప్ కూడా తీసుకొస్తుంది. దశలవారీగా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ముందుగానే ఈ ఫీచర్ కావాలనుకుంటే వాట్సప్ బీటా వెర్షన్‌లో నమోదు చేసుకోండి. గూగల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి కిందకు స్క్రోల్ చేస్తే బీటా వెర్షన్ కనిపిస్తుంది.

బీటా వెర్షన్‌లో నమోదు చేసుకుంటే మీకు కొత్త ఫీచర్ వస్తుంది. అయితే ఇది లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆప్షన్ ఎప్పుడు వస్తుందా అనేది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి బీటా వెర్షన్‌లో రిజిస్టర్ అయితే వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫీచర్‌ను సెటప్ చేసుకోవచ్చు.

వాట్సప్ పైభాగంలో మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి కొత్త ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేయండి. ఆ తర్వాత యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. 3 నుంచి 35 అక్షరాల వరకు యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. www, .com, .net వంటివి ఉపయోగించకూడదు.