Smartphone: మార్కెట్లోకి కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్‌.. ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి..

|

Nov 30, 2023 | 10:21 PM

మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌లను సందడి చేస్తున్నాయి. కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్‌ నెలలో మార్కెట్లోకి కొన్ని కొత్త ఫోన్‌లను సందడి చేయనున్నాయి. ప్రధానంగా డిసెంబర్ నెలలో నాలుగు కొత్త ఫోన్‌లు మార్కెట్లోకి లాంచ్‌ కానున్నాయి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురానున్నారు. ఇంతకీ డిసెంబర్‌లో లాంచ్‌ కానున్న ఫోన్‌లపై ఓ లుక్కేయండి..

1 / 5
డిసెంబర్ నెలలో కొత్తగా నాలుగు ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. వీటిలో ఐకూ 12, వన్‌ప్లస్‌ 12, రెడ్‌మీ నోట్‌13 ప్రో ప్లస్‌తో పాటు ఒప్పో రెనో 11 వంటి స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ ఈ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఐకూ12: ఐకూ12 స్మార్ట్‌ ఫోన్‌ను డిసెంబర్‌ 12వ తేదీన మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో.. 50 మెగా పిక్సెల్ OIS కెమెరా, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

3 / 5
వన్‌ప్లస్‌ 12: వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ ఫోన్‌ను డిసెంబర్‌ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేయనుంది. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన 2K OLED డిస్‌ప్లేను అందించనున్నారు. 100 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఈ ఫోన్‌లో ఇవ్వనున్నారు. 64 ఎంపీ రెయిర్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం.

4 / 5
 ఒప్పో రెనో 11 సిరీస్‌: ఈ స్మార్ట్‌ ఫోన్‌ను డిసెంబర్‌ మధ్యలో విడుదల చేయనున్నారు. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్‌ సొంతం. 50 ఎంపీ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. 67W ఫాస్ట్ ఛార్జింగుతో 4,800 mAh బ్యాటరీని ఇవ్వనున్నారు.

5 / 5
రెడ్‌మీ నోట్‌13 ప్రో ప్లస్‌: రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్ డిసెంబర్‌ చివరి నాటికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 200 ఎంపీ ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. 6.67 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. 120 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.