Realme gt 5 pro: రియల్‌మీ నుంచి ప్రీమియం ఫోన్‌ వచ్చేస్తోంది.. సూపర్‌ ఫీచర్స్‌.

|

Nov 04, 2023 | 10:09 AM

ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ విస్తరిస్తున్న క్రమంలో స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థలు 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ఫోన్‌లతో పాటు, ప్రీమియం 5జీ ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌ మీ మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రియల్‌మీ జీటీ 5 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.?

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. రియల్‌మీ జీటీ 5 ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. ఈ నెల చివర్లో భారత మార్కట్లోకి ఈ ఫోన్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

2 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. సోనీ నెక్ట్స్ జనరేషన్ ల్వెతియా ఎల్‌వైటీ 808 (LYTIA LYT808) సెన్సర్ మెయిన్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌ను అందించారు. అలాగే ఓమ్నీ విజన్ ఓవీ08డీ10 సెకండరీ సెన్సర్, సోనీ ఐఎంఎక్స్ 890 టెలిఫోటో సెన్సర్‌ను ఇవ్వనున్నారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్‌ లాంచ్‌ కాగా భారత్‌లో ఎప్పుడనేదానిపై క్లారిటీ లేదు.

4 / 5
ఇక రియల్‌మీ జీటీ5 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 1264×780 పిక్సెల్స్ ఈ స్క్రీన్‌ సొంతం.

5 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేయనున్నారు. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌, 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. 100 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌, 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో కూడిన 5400 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు.