Realme 12: భారత్‌లో లాంచ్‌ అయిన రియల్‌మీ12.. తక్కువ ధరలో అదిరే ఫీచర్స్‌

|

Mar 07, 2024 | 10:20 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ 12 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు. బుధవారం భారత్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా రియ్‌ల్‌మీ 12, రియల్‌మీ 12+ ఫోన్‌లను తీసుకొచ్చారు. ఇంతకీ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం భారత మార్కెట్లోకి రియల్‌12 సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా రియల్‌మీ12, రియల్‌మీ 12+ ఫోన్‌లను లాంచ్‌ చేశారు. ఈ రెండు స్మార్ట్‌ ఫోన్‌లు ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

2 / 5
ధర విషయానికొస్తే రియల్‌మీ12 5జీ ఫోన్‌ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 16,999కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 17,999గా ఉంది. ఇక రియల్‌మీ12+ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 20,999 కాగా.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 21,999గా ఉంది.

3 / 5
రియల్‌మీ 12 5జీ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోంస 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ప్రత్యేకంగా స్టీరియో స్పీకర్‌లను అందించారు. అలాగే ఛార్జింగ్‌ విషయానికొస్తే ఇందులో 45W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిచారు. అలాగే.. దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.

5 / 5
ఇక రియల్‌మీ 12+ 5G ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+  స్క్రీన్‌ను అందించారు. ఇందులోన ప్రత్యేకంగా రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌‌ను ఇచ్చారు.  50 ఎంపీ రెయిర్‌ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో.. 67 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు