PUBG Mobile: ఆటగాళ్లకు శుభవార్త.. తక్కువ ర్యామ్ ఫోన్ల‌లో కూడా.. అదిరిపోయే ఫ్యూచర్స్ తో రానున్న PUBG

Updated on: Aug 21, 2026 | 1:29 PM

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ గేమింగ్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న బ్యాటిల్ రాయల్ గేమ్ పబ్జీ మొబైల్. అయితే హై-ఎండ్ గ్రాఫిక్స్, భారీ స్టోరేజ్ సైజు కారణంగా బడ్జెట్ లేదా తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఈ గేమ్‌ను ఆడటం చాలామందికి కష్టంగా మారింది. అలాంటి గేమర్ల కోసమే డెవలపర్లు సరికొత్తగా తీర్చిదిద్దిన పబ్జీ మొబైల్ లైట్ వెర్షన్‌ను 2026లో అధికారికంగా తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

1 / 5
తక్కువ స్పెసిఫికేషన్లు కలిగిన డివైజ్‌లలో కూడా లాగ్ లేకుండా అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా ఈ గేమ్‌ను రూపొందించారు. ఈ సరికొత్త 'పబ్జీ మొబైల్ లైట్' వెర్షన్ ప్రత్యేకంగా 2GB లేదా 4GB ర్యామ్ కలిగిన బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది.

2 / 5
ప్రధాన గేమ్‌తో పోలిస్తే దీని ఇన్‌స్టాలేషన్ ఫైల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫోన్ స్టోరేజ్ నిండిపోవడం, గేమ్ ఆడుతున్నప్పుడు వేడెక్కడం లేదా ఫ్రేమ్ డ్రాప్స్ వంటి సమస్యలు లేకుండా చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. : మెయిన్ పబ్జీ మొబైల్ గేమ్‌లో ఉండే అసలైన థ్రిల్‌ను ఏమాత్రం తగ్గించకుండా లైట్ వెర్షన్‌ను ఆప్టిమైజ్ చేశారు.

3 / 5
ఇందులో చిన్న సైజు మ్యాప్‌లు, వేగవంతమైన మ్యాచ్ టైమింగ్స్ ఉంటాయి. సాధారణంగా ఒక మ్యాచ్ 10 నుండి 15 నిమిషాల్లో ముగిసేలా రూపొందించడం వల్ల బ్యాటరీ వినియోగం, ఇంటర్నెట్ డేటా ఖర్చు చాలావరకు తగ్గుతాయి. ఒకేసారి 60 మంది ప్లేయర్లు బరిలోకి దిగి పోరాడేలా గేమ్ రూల్స్ సెట్ చేశారు.

4 / 5
తక్కువ రిసోర్సెస్‌తో పనిచేసే అన్‌రియల్ ఇంజిన్ ఆధారంగా ఈ గేమ్‌ను రూపొందించారు. గ్రాఫిక్స్ క్వాలిటీ తేలికగా ఉన్నప్పటికీ, విజువల్స్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. కంట్రోల్స్, రీకాయిల్ కంట్రోల్ మరియు యూజర్ ఇంటర్‌ఫేస్ మొబైల్ స్క్రీన్‌పై చాలా సులువుగా ఆపరేట్ చేసుకునేలా డిజైన్ చేయబడ్డాయి.

5 / 5
ఈ సరికొత్త పబ్జీ మొబైల్ లైట్ రాకతో ఖరీదైన ఫోన్లు లేని సాధారణ గేమర్లు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్‌లైన్ బ్యాటిల్ రాయల్ గేమింగ్‌ను పూర్తిగా ఆస్వాదించవచ్చు. సరసమైన ధరల స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ గేమ్ 2026లో అత్యంత ఆదరణ పొందే మొబైల్ గేమ్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది!

Loading...
Unable to load recommendations.
Follow Us