Oneplus Nord 2t: వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ కెమెరా..

|

Jun 24, 2022 | 9:46 AM

Oneplus Nord 2t: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మరో బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ మొదటి సేల్‌ జూలై 5 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
ఇటీవల బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న వన్‌ప్లస్‌ తాజాగా మరో కొత్త ఫోన్‌ను ఇండియన్‌ మార్కెట్లోకి తీసుకొస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ పేరుతో రూపొందించిన ఈ ఫోన్‌ జూలై 1న లాంచ్‌ కానుంది.

2 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.43 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్; 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ ఫోన్‌ డిస్‌ప్లే సొంతం.

3 / 5
 కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌తో పనిచేస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

5 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రెండు వెర్షన్స్‌లో తీసుకురానున్నారు. 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 28,999కాగా, 12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 33,999గా ఉంది.