Tech: ఈ పాట ఏ సినిమాలోనిదబ్బా.. మీక్కూడా ఇలాంటి సందేహం వచ్చిందా.?

|

Dec 05, 2024 | 10:11 PM

కారులోనో, బస్సులోనే వెళ్తున్నప్పుడు ఎఫ్‌ఎమ్‌ లేదా ప్లేయర్‌లో ఒక మంచి పాట వస్తుంది. ఆ పాట అంతకు ముందు ఎప్పుడు విని ఉండరు. కానీ మీకు ఆ పాట తెగ నచ్చుతుంది. దీంతో ఆ పాట ఏ సినిమాలోనిదన్న విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంటుంది. అయితే తెలుగు పాట అయితే ఏదో రకంగా సెర్చ్‌ చేస్తారు.? ఇతర భాషల సాంగ్స్‌ అయితే కష్టం కదూ...

1 / 5
ఎక్కడో ఒక చోట వినిపించే పాట మనకు ఎంతగానో నచ్చుతుంది. అయితే ఆ పాట ఏ సినిమాలోనిదన్న విషయం మాత్రం గుర్తుకురాదు. ఇలాంటి సమయాల్లో ఏం చేస్తాం. పక్కనున్న వారిని అడుగుతాం. వారికి కూడా తెలియదలంటే వదిలేస్తాం.

2 / 5
కానీ ఆ పాటను మళ్లీ వినాలంటే ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఆండ్రాయిడ్‌ ఓ అదిరిపోయే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో సదరు పాటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇట్టే తెలుసుకోవచ్చు.

3 / 5
ఐఓఎస్‌లోని ‘షాజమ్‌’ మాదిరిగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనూ తాజా 15 అప్‌డేట్స్‌తో ‘సర్కిల్స్‌ టు సెర్చ్‌’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటి వరకు కేవలం పిక్సెల్‌ ఫోన్‌లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను మిగతా ఫోన్‌లలోనూ తీసుకొచ్చారు.

4 / 5
ఇందుకోసం ముందుగా యూజర్లు హోమ్‌ బటన్‌ను ప్రెస్‌ చేసి పట్టుకోవాలి. వెంటనే కింది భాగంలో కుడి వైపు మెనూ బార్‌ ప్రత్యక్షమవుతుంది. అందులో ‘ఐడెంటిఫై సాంగ్‌’ అనే ఆఫ్షన్‌పై క్లిక్‌ చేయాలి.

5 / 5
ఈ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకున్న తర్వాత బయట వినిపించే పాట శబ్ధం, భాష ఆధారంగా దానికి సంబంధించిన లింక్‌ ప్రత్యక్షమవుతుంది. దీంతో యూట్యూబ్‌లోకి వెళ్లి ఆ పాటను వినొచ్చు. అంతేకాదు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన మీరు పాట పాడినా వెంటనే గుర్తుపడుతుంది.