Poco F3 GT: త్వరలో మార్కెట్లోకి పోకో కొత్త ఫోన్‌.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న లీక్‌డ్‌ ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చంటే..

| Edited By: Ravi Kiran

Jul 19, 2021 | 6:30 AM

Poco F3 GT: లేటెస్ట్‌ ఫీచర్లతో మొబైల్‌ ప్రియులను ఆకట్టుకుంటోన్న చైనా కపెంనీ పోకో తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. పోకో ఎఫ్‌3 జీటీ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫీచర్లు ఏంటంటే..

1 / 6
మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వస్తోంది. ముఖ్యంగా చైనాకు చెందిన కంపెనీలు అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫోన్‌ విడుదలకు ముందే వాటి ఫీచర్లకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

2 / 6
తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ పోకో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. పోకో ఎఫ్‌3 జీటీ పేరుతో రానున్న ఈ ఫోన్‌కు సంబంధించి లీకైన వివరాలు ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

3 / 6
నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌ను రెడ్‌మీ కే 40 గేమ్‌ ఎన్‌ హాన్స్‌డ్‌ వెర్షన్‌కు రీ బ్రాండెడ్‌ వెర్షన్‌గా తీసుకురానున్నారని సమచారం. ఈ ఫోన్‌ను 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్ డిస్‌ప్లే అందించనున్నారు.

4 / 6
ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 1200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పాటు 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను అందించనున్నట్లు సమాచారం.

5 / 6
ఇక కెమెరా విషయానికొస్తే.. 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 16 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

6 / 6
భారత మార్కెట్లో సుమారు రూ. 30 వేల ఉండనుందని వార్తలు వస్తోన్న ఈ ఫోన్‌లో 67 W ఫాస్ట్‌ చార్జింగ్‌తో 5,065 ఎంఏహెచ్​బ్యాటరీతో నడవనుంది.